Mahesh Babu : తేజ ముందు తేలిపోయిన మహేశ్ బాబు.. ‘గుంటూరు కారం’కు ‘హనుమాన్’ షాక్

- Advertisement -


Mahesh Babu : ఈ ఏడాది సంక్రాంతి పండుగకు మరో వారం రోజలే మిగిలింది. తెలుగు సినిమాలకు సంక్రాంతి మంచి బిజినెస్ టైంది. అందుకే చాలా మంది హీరోలు తమ సినిమాలను సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలని అనుకుంటారు. ఈ సారి సంక్రాంతికి దాదాపు ఐదు సినిమాలు పోటీ పడనున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న కారణమో మరేదో తెలియదు కానీ ఈ రేసు నుంచి మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా తప్పుకుంది. ఇక పోతే రేసులో మహేష్ ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామిరంగా’, వెంకటేష్ ‘సైంధవ్’, తేజ ‘హనుమాన్’ సినిమాలు ఉన్నాయి.

ఈ నాలుగు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ పలు వెబ్ సైట్లలో ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. యంగ్ హీరో తేజ “హనుమాన్” బుక్ మై షోలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకి 187K టిక్కెట్లు బుక్ చేయగా, మహేష్ “గుంటూరు కారం”కి కేవలం 186K మాత్రమే బుక్ అయ్యాయి. బుక్ మై షో లో మహేష్ ని తలదన్ని హనుమాన్ మూవీ దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు బచ్చాగాడి ముందు సూపర్ స్టార్ బలాదూర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
 

https://www.instagram.com/p/C1rheTHJg2U/?utm_source=ig_embed&ig_rid=50227683-3477-43f8-bcaa-da73e16828b2

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here