Bigg Boss Telugu : ప్రతీ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఒక ఎంటర్టైనర్ ఉండడం అనేది సర్వసాధారణం. ఈ సీజన్ లో అలా ఎంటర్టైనర్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని మరియు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు టేస్టీ తేజా. ఇతను మిగిలిన కంటెస్టెంట్స్ లాగా గేమ్స్ ఆడదు. తనకి తెలిసిన ఎంటర్టైన్మెంట్ తోనే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో నెట్టుకొచ్చాడు. ఎంటర్టైనర్ మాత్రమే కాదు, డేంజరస్ కంటెస్టెంట్ కూడా.

ఇతని గత మూడు నామినేషన్స్ ఎంత సిల్లీ గా ఉన్నాయో మనమంతా చూసాము. సిల్లీ కారణాలతో ఇతను నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరూ ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. ముందుగా షకీలా ని ఇలా నామినేట్ చేసి బయటకి పంపాడు. అతను నామినేషన్ చేసిన పాయింట్ కూడా చాలా సిల్లీ గా అనిపించింది. ఇక గత ఇదే సిల్లీ కారణంతో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా ని కూడా బయటకి పంపేశాడు.

ఇతను నిద్రపోతున్న సమయం లో ఆమె మూడు చుక్కల నీటి బొట్లు ముఖం మీద పోసింది అనే కారణం తో నామినేట్ చేసాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ మరియు పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడని కంటెస్టెంట్ కావడం తో పాపం పూజా ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఈ వారం సందీప్ ని కూడా అలాగే సిల్లీ నామినేషన్ తో బయటకి పంపేశాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్ లోకి రాలేదు కాబట్టి, ఒక్కసారి నామినేషన్ లోకి వెళ్లి సేవ్ అయితే నీలో కాంఫిడెన్స్ బాగా పెరుగుతుంది, అందుకోసమే నామినేట్ చేశాను అని చేసాడు.

సందీప్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. ఇలా పనికిమాలిన కారణాలతో కంటెస్టెంట్స్ అందరినీ బయటకి పంపిస్తున్న ఏకైక కంటెస్టెంట్ గా టేస్టీ తేజా బిగ్ బాస్ హిస్టరీ లో చరిత్ర సృష్టించాడు. గత వారం ఇలా సిల్లీ నామినేషన్స్ చేస్తున్నాడు అనే అర్జున్ తేజా ని నామినేట్ చేసారు. అయినా కానీ మారలేదు, సందీప్ ఎలిమినేషన్ తర్వాత అయినా టేస్టీ తేజా లో మార్పు వస్తుందో లేదో చూద్దాం.