Bigg Boss Season 8 లోకి టీం ఇండియన్ క్రికెటర్..అభిమానులకు ఊహించని సర్ప్రైజ్!

- Advertisement -

Bigg Boss 8 : ప్రతీ ఏటా ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సీజన్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండే విధంగా బిగ్ బాస్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటుంది. సోషల్ మీడియా లో ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనేది దాదాపుగా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా ఫైర్ బ్రాండ్, ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడుని తీసుకునేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు మొదలు పెట్టిందట.

Bigg Boss 8
Bigg Boss 8

ఇప్పటికే అంబటి రాయుడి ని ఈ విషయమై సంప్రదించారట కూడా. ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంబటి రాయుడు ఇండియన్ టీం తరుపున ఆడిన మ్యాచులు తక్కువే అయ్యినప్పటికీ మంచి టాలెంట్ ఉన్న వాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్ లో తనకి స్థానం దక్కలేదని క్రికెట్ నుండి తప్పుకున్న ఆయన, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరుపున గత ఏడాది వరకు ఆడాడు. ఆ తర్వాత ఆయన క్రికెట్ కి పూర్తి స్థాయి రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసాడు. తొలుత వైసీపీ పార్టీ లో చేరిన ఆయన, అక్కడి వాతావరణం సరిగా నచ్చకపోవడం తో వెంటనే ఆ పార్టీ కి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ లోకి యంగ్ పొలిటీషియన్.. జనసేన నేతకు బంపర్ ఆఫర్! | indian cricketer janasena leader ambati rayudu into bigg boss telugu season 8 - Telugu Filmibeat

- Advertisement -

జనసేన పార్టీ తరుపున ఈ ఎన్నికలలో ఒక స్టార్ క్యాంపైనర్ గా విస్తృతంగా ప్రచారం చేసిన అంబటి రాయుడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. స్వతహాగా ముక్కోపి స్వభావం ఉన్న అంబటి రాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బోలెడంత కంటెంట్ దొరుకుతుందని, అందుకే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి అయినా సరే, ఆయనని బిగ్ బాస్ లోకి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Ambati Rayudu Does U-Turn On Retirement, Wants To Play For Hyderabad Again

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here