నిహారికతో తరుణ్ పెళ్లి.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన లవర్ బాయ్

- Advertisement -

నిహారికను తరుణ్ పెళ్లాడబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. రీసెంట్ గా డివోర్స్ తీసుకున్న నిహారిక.. మళ్ళీ పెళ్ళికి రెడీ అయిందని, తరుణ్ ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ చర్చించుకొని వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేశారనే టాక్ బయటకొచ్చింది. దీంతో స్వయంగా దీనిపై తరుణ్ క్లారిటీ ఇచ్చారు. త‌రుణ్ పెళ్లి కోసం ఆయ‌న ఫ్యాన్స్‌.. ప‌దేళ్ల నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తరుణ్ తల్లి రోజారమణి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా.. ముందు తరుణ్‌ పెళ్లి గురించే ప్రశ్న వినిపించేది.

నిహారిక
నిహారిక

ఈ మధ్యే ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని తరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం అంటే మెగా ఫ్యామిలీనే కాబట్టి.. నిహారికతో తరుణ్‌ పెళ్లి అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అందుకుంది. రెండు రోజులుగా త‌రుణ్ పెళ్లికి సంబంధించి ఈ న్యూస్ వైరల్‌గా మారింది. త‌రుణ్ త్వర‌లోనే మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడ‌ని.. చైత‌న్య జొన్నల‌గ‌డ్డకు విడాకులు ఇచ్చేసిన మెగా డాట‌ర్ నిహారిక‌ను పెళ్లాడ‌బోతున్నాడ‌ని ప్రచారం జ‌రుగుతోంది. దీనిపై తరుణ్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి గురించి వస్తున్న వార్త నిజం కాదని క్లియర్‌కట్‌గా చెప్పేశాడు. ఏదైనా గుడ్‌న్యూస్ ఉంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా చెప్తానని.. తన పెళ్లి విషయంలో ఇలాంటి పుకార్లు క్రియేట్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశాడు.

దీంతో నిహారిక‌తో త‌రుణ్ పెళ్లి అన్న వార్త పుకారే అని తేలిపోయింది. ‘మనసు మమత’తో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తరుణ్‌. బాలనటుడిగా పలు చిత్రాలకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. 2000లో విడుదలైన ‘నువ్వేకావాలి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రేమకథల్లో నటించి లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్‌స్టోరీ’ తర్వాత యాక్టింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here