Tarakaratna : ఏ హీరోయిన్ కి అయినా మొదటి సినిమా నుండే సక్సెస్ లను చూడడం చాలా అరుదు.టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా కలిసిరావాలి, అలా మొదటి సినిమా నుండే సక్సెస్ లను చూస్తూ ఇండస్ట్రీ లోకి తారాజువ్వ లాగ ఎగసి దూసుకొచ్చిన హీరో రేఖా వేదవ్యాస్.ఈమె అసలు పేరు అక్షర, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందే కన్నడ లో రెండు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

తెలుగు లో ఎంట్రీ ఇస్తూనే శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘ఆనందం’ సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమాలో హీరో తో పాటుగా సరిసమానమైన ఇమేజి ని సంపాదించింది రేఖా.ఈ సినిమా భారీ హిట్ అవ్వడం తో రేఖా కి టాలీవుడ్ లో అవకాశాలు వరుసగా క్యూ కట్టేశాయి.అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చి సూపర్ హిట్స్ కొడుతున్న హీరోలకు జోడిగా రేఖనే ఎంచుకునేవారు దర్శక నిర్మాతలు.

అలా నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి భారీ హైప్ తో అడుగుపెట్టిన తారకరత్న మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు‘ లో కూడా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది రేఖా.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది,ఆ తర్వాత ‘దొంగోడు’, ‘అనగనగా ఒక కుర్రాడు’,’జానకి వెడ్స్ శ్రీరామ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రేఖా కి, తెలుగులో కంటే కూడా కన్నడ లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి, అక్కడ టాప్ లీడింగ్ స్టార్ హీరోలందరితో ఈమె కలిసి నటించింది.

ఈమె కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాదు, నటనకి ప్రాధాన్యం ఉన్న నెగటివ్ రోల్స్ లో కూడా నటించి తన సత్తా చాటింది.అలా 2014 వ సంవత్సరం వరకు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన రేఖా,ఆ తర్వాత బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్ళాడి,అక్కడే స్థిరపడిపోయింది.అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి, బొద్దుగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన రేఖ లేటెస్ట్ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.