Taraka Ratna నందమూరి తారకరత్న చనిపోయిన ఘటన నుండి తెలుగు సినీ పరిశ్రమ మరియు నందమూరి అభిమానులు ఇప్పటికీ కోలుకోలేదు. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి బాధ అయితే వర్ణనాతీతం. ప్రతీ రోజు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తారకరత్న ని తల్చుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది. మొదటి నుండి ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే సుఖంగా బ్రతుకుతున్న సమయంలో మమల్ని వదిలి వెళ్ళిపోయావు అంటూ ఆమె రోధించడం నందమూరి కుటుంబాన్ని మరియు అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది.

ఇక రీసెంట్ గా ఆమె బాలయ్య బాబు గురించి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. తారకరత్న ని మొదటి నుండి అన్నీ బాలయ్య బాబే చూసుకునేవాడు, తారకరత్న ని తన సొంత బిడ్డలాగానే చూసుకుంటూ వచ్చాడు అంటూ సోషల్ మీడియా లో ఇదివరకే ఎన్నో కథనాలు ప్రచారం అయ్యాయి. తారకరత్న మిత్రులు మరియు సన్నిహితులు కూడా ఇదే మాట అన్నారు.

ఇప్పుడు బాలయ్య బాబు తారకరత్న పై చూపించిన ప్రేమ గురించి అలేఖ్య రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘మనకి అత్తమామల తోడు లేదు, మనల్ని సొంత కుటుంబం లోకి చేర్చుకొని ఎంతో ప్రేమగా చూసుకున్న ఏకైక వ్యక్తి బాలయ్య మాత్రమే. మన కష్టసుఖాల్లో తోడు గా నిలిచిన ఏకైక మనిషి ఆయన, నీకు గుండెపోటు వచ్చినప్పుడు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించిన దగ్గరి నుండి, నువ్వు కోలుకోవడానికి ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. ఒక తండ్రిగా నీ ఆరోగ్యం కుదుట పడాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసారు. నీ పక్కనే వచ్చి కూర్చొని ఒక్క తల్లిలాగే పాటలు పాడాడు, సిల్లీ జోక్స్ వేసి నిన్ను రియాక్ట్ అయ్యేలా చెయ్యడం, ఎన్ని ప్రయత్నాలు చేసిన నువ్వు స్పందించకపోవడం తో ఎవ్వరు లేని సమయం లో కూర్చిని ఒంటరిగా ఏడవడం, ఇవన్నీ దగ్గరి నుండి చూసి మేము కన్నీళ్లు పెట్టుకోవడం. మేము కన్నీళ్లు పెట్టుకుంటే మాకు ధైర్యం చెప్పడం, అలాంటి మనిషి బాలయ్య ఇప్పటికీ మాతోనే ఉన్నాడు, కానీ నువ్వే మా మధ్య లేవు..మిస్ యూ’ అంటూ ఈ సందర్భంగా ఆమె వేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
