Tapsee Pannu : ఎర్ర చీరలో ఏం సక్కగున్నావే.. ఓ సొట్టబుగ్గల దానా

- Advertisement -

Tapsee Pannu .. ఈ సొట్టబుగ్గల సుందరి టాలీవుడ్​లో ఝుమ్మంది నాదం అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇక కొంతకాలం తర్వాత బాలీవుడ్​కు మకాం మార్చిన ఈ దిల్లీ డాల్.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ అయిపోయింది. అయితే తెలుగు సినిమాకు దూరమైనా ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా తన అప్డేట్స్ ఇస్తూ టాలీవుడ్ అభిమానులకు టచ్​లో ఉంటోంది. తాజాగా తాప్సీ తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.

Tapsee Pannu
Tapsee Pannu

రెడ్ కలర్ శారీలో తాప్సీ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి. ఈ శారీలో తాప్సీ సోయగం సొగసు చూడతరమా అన్నట్లుగా ఉంది. నడుం అందాలు ఎక్స్​పోజ్ చేస్తూ ఈ భామ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు కైపెక్కిస్తున్నాయి. ఎర్రచీరలో తాప్సీ ఘాటు మిర్చిలా మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఈ సొట్టబుగ్గల సుందరి అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.

Tapsee Pannu Photos

- Advertisement -

ఇక తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్​లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే వరుస పెట్టి సినిమాలు చేసేస్తోంది. ఈ భామ రొటీన్ సినిమాలు కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. అందుకే తాప్సీ మూవీ ఛాయిస్ అంటే ప్రేక్షకులకే కాదు బాలీవుడ్ నటులకు కూడా ఇష్టం. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. వో లడ్కీ హై కహా, ఖేల్ ఖేల్ మే, ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబా సినిమాల షూటింగులో ప్రస్తుతం తాప్సీ బిజీగా గడుపుతోంది. ఇక ఈ భామ ఇటీవలే తన బాయ్​ఫ్రెండ్ మాథియాస్ బోని వివాహమాడింది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here