Tammareddy : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, సీటల్ ఫిల్మ్ క్రిటిక్ వంటి అవార్డ్స్ తో పాటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ సినిమాపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదంగా మారాయి.. దాంతో ఆ కామెంట్స్ పై నటుడు నిర్మాత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ట్వీట్ చేశారు.. తాజాగా వీరిద్దరికీ కౌంటర్ ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ..

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన మాటలకు నాగబాబు నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా, రాజమౌళిని చూసి జలస్ ఫీల్ అవుతున్నావని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా నీకు అకౌంట్స్ తెలుసా అని తమ్మారెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా వీరి వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. నీకు లెక్కలు తెలుసా అని.. రాజమౌళిని చూసి నేను జలస్ ఫీల్ అవుతున్నానని అన్నారు. నేను ఆయన్ని చూసి జలస్ ఫీల్ అవ్వడానికి నేను ఆయనకు పోటీగా ఉండాలి. ఆయనతో సమానంగా సినిమాలు తీసేవాడినైనా అయి ఉండాలి. నాకెందుకు జలసి.. నేనేదో కృష్ణా రామా అని బతుకుతున్నాను. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని తమ్మారెడ్డి అన్నారు.
నేను ఎవరిని ఒక్క మాట అనను. కానీ నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు. నాకు ఈ అకౌంట్స్ తెలుసా అని అన్నారు. నాకేం తెలియనక్కర్లేదు. నాకు చాలా మంది అకౌంట్స్ తెలుసు. ఎవడెవడు ఎవడెవడిని ఏ అవార్డుల కోసం ఏం అడుక్కున్నారో.. ఏ పదవులు కోసం ఏం అడుక్కున్నారో.. ఎవరెవడి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలిసు. ఇవన్నీ మాట్లాడి ఇండస్ట్రీ పరువు రోడ్డు మీద పడడం నాకు తెలుసు.. కానీ నేనెప్పుడూ ఆ పని చేయలేదు.

ఒక్కడైతే మీ అమ్మ మొగుడు అని అంటాడు. మా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు . మా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నీతిగా బతకడం నేర్పించాడు. అందుకే నేను మాట్లాడకుండా నా సంస్కారం ఆపేస్తుంది అని ఆయన అన్నారు. నిన్న గాక మొన్న నేను రాజమౌళి గారు గొప్పవాడన్నప్పుడు మీకు అది తెలియదా.. ఎవడో ముక్క కట్ చేసి పెడితే తెలిసిందే. మీకులా కాళ్లు పట్టుకునే వాళ్ళు నా గురించి మాట్లాడే హక్కు లేదు ఎవరే మాట్లాడుకున్నా నాకు పర్వాలేదు. నేను నిజాయితీగా నే ఉంటాను. అలాగే చచ్చిపోతాను.. అంటూ తమ్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.