Viswambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో తమిళ సూపర్ స్టార్.. ప్లానింగ్ మామూలు రేంజ్ లేదు!

- Advertisement -

Viswambhara : ‘భోళా శంకర్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింభిసార’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వసిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసారు. నిన్న స్టంట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ఆడవార్సాయం లో భారీ ఫైట్ సన్నివేశాలను ప్రారంభించారు.

Viswambhara
Viswambhara 

10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ని తెరకెక్కించబోతున్నారట. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది. వాళ్ళ పేర్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా అనుష్క, సాయి పల్లవి , మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్స్ పేర్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Chiranjeevi

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శింబు నటించబోతున్నాడట. ఆయన క్యారక్టర్ ఇందులో నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని టాక్. రీసెంట్ గానే డైరెక్టర్ వసిష్ఠ శింబు ని చెన్నై లో కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించాడట. ఆయనకీ బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.

- Advertisement -
Viswambhara Movie

ముందుగా ఈ పాత్ర కోసం దగ్గుపాటి రానా ని ఎంచుకున్నారట. కానీ ఆయన ఎందుకో మళ్ళీ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. దీంతో పలువురి పేర్లను పరిగణలోకి తీసుకున్న డైరెక్టర్ వసిష్ఠ చివరికి శింబు ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రానుంది. వచ్చే నెలలోనే అధికారిక ప్రకటన చెయ్యొచ్చు అని అంటున్నారు, చూడాలి మరి.

Shimbu
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here