పవన్ కళ్యాణ్ సినిమాని రీమేక్ చెయ్యడం నా వల్ల కాదు అని దండం పెట్టిన తమిళ స్టార్ హీరో అతనేనా!

- Advertisement -

సౌత్ ఇండియా లో ప్రస్తుతం ఉన్న నేటి తరం స్టార్ హీరోలలో అత్యధిక రీమేక్ సినిమాలను చేసిన హీరోలు ఎవరు అంటే మనకి టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ మరియు తమిళం నుండి విజయ్ గుర్తుకొస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలను మరియు పాటలను కొన్ని విజయ్ తమిళం లో రీమేక్ చేసాడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా విజయ్ సినిమాలు కొన్ని రీమేక్ చేసాడు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి రీమేక్ చెయ్యాలని ప్రయత్నం చేసి, ఆ తర్వాత నా వల్ల కాదు బాబోయ్ అని దండం పెట్టి వెళ్ళిపోయాడట హీరో విజయ్. ఆ సినిమా మరేదో కాదు, జల్సా. పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో సంచలనం విజయం సాధించి, ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి, ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిలిచింది.

Pawan Kalyan

అయితే ఈ సినిమాని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ మరియు నటుడు ప్రభుదేవా తమిళ హీరో విజయ్ తో రీమేక్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో.ఉన్నాడు. ఈ సినిమాని చూడాల్సిందిగా విజయ్ కి సూచించాడు. ఆయన సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసాడు కానీ, రీమేక్ చేసే సాహసం మాత్రం చేయలేనని ముఖం మీదనే చెప్పేసాడు అట. ఎందుకంటే ఆ చిత్రం లోని కామెడీ టైమింగ్, స్టైల్ , మరియు స్వాగ్ మొత్తం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సొంతం, వాటివల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది, పెద్ద స్టోరీ కూడా కాదు అంటూ చెప్పాడట విజయ్.

- Advertisement -
Vijay Thalapathy

అలా ఆ ప్రాజెక్ట్ అట్టకెక్కింది, అయితే కొన్నాళ్ల తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. ఈ చిత్రం లో విజయ్ జల్సా సినిమా టైటిల్ సాంగ్ ని రీమేక్ చేసాడు. ఒరిజినల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ తన స్టైల్ తో నడుచుకుంటూ వచ్చి ఆ పాటకి వన్నె తెస్తే, విజయ్ బీచ్ లో నయనతార తో కలిసి స్టెప్పులేసి ఆ పాటకి ఉన్న విలువని పోగొట్టాడు అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో సందర్భాలలో విజయ్ ని ట్రోల్ చేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here