Jiiva : ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి కొడుకు జీవా గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను రంగం అనే సూపర్ హిట్ ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. తమిళం లో మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీ లో ఇతను రాణించాడు. రంగం తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయికి ఎదగలేదు, పైగా ఎన్నో ఏళ్ళ నుండి కాపాడుకుంటున్న తన తండ్రి గౌరవం ని కూడా మంటగలిపే కార్యక్రమాలు చేస్తున్నాడు అని కాసేపటి క్రితమే తెలిసిందే.
ఇతను రీసెంట్ గా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లో అడ్డం గా దొరికిపోయాడట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త కనిపిస్తుంది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఈ టోర్నమెంట్ లోనే జీవా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉంటాడా, లేదా పాత మ్యాచులకు సంబంధించి చేశాడా అనేది తెలియాల్సి ఉంది.
బాలనటుడిగా పలు తమిళ సినిమాల్లో నటించిన జీవా, 2003 వ సంవత్సరం లో ‘ఆశాయ్’ అనే తమిళ సినిమాతో హీరో గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత దాదాపుగా 50 సినిమాలకు పైగా చేసాడు కానీ సక్సెస్ రేట్ పెద్దగా లేదు. హీరో గా ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అవ్వడం తో, అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో మారుస్తున్నాడు.
2021 వ సంవత్సరం లో కపిల్ దేవ్ బయోపిక్ అయినా 83 లో ప్రముఖ క్రికెటర్ శ్రీకాంత్ గా నటించాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఈ ఏడాది లో నాగ చైతన్య హీరో గా నటించిన ‘కస్టడీ’ చిత్రం లో ఒక అతిథి పాత్రలో నటించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బయోపిక్ ‘యాత్ర 2 ‘ లో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది, ఇంత లోపే ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ కేసు లో చిక్కుకున్నాడు.