Vijay Kanth : అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు కమల్ హాసన్ తర్వాత తమిళనాడు లో వాళ్ళతో సమానంగా సూపర్ హిట్స్ కొట్టి అశేష ప్రేక్షాభిమానం సంపాదించిన హీరో విజయ్ కాంత్. 2009 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా ఆయన సినిమాల్లో కొనసాగాడు. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఠాగూర్’ చిత్రం, విజయ్ కాంత్ తమిళం లో హీరో గా చేసిన ‘రమణ’ కి రీమేక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.
2009 వ సంవత్సరం తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి డీఎండీకే పార్టీ ని స్థాపించాడు. కొన్నాళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కొనసాగి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ని కొనసాగించిన విజయ్ కాంత్, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా యాక్టీవ్ గా లేదు. గత కొద్దిరోజుల క్రితమే ఆయన ఊపిరి తిత్తుల సమస్య కారణంగా హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నాడు.
అయితే విజయ్ కాంత్ ఆరోగ్యం విషమించింది అని, కాసేపటి క్రితమే ఆయన చనిపోయాడని సోషల్ మీడియా లో ప్రచారమైన ఒక వార్త సంచలనం రేపింది. విజయ్ కాంత్ అభిమానులు ఈ వార్త విని కుప్పకూలిపోయారు. సోషల్ మీడియా లో ప్రచారమైన ఈ వార్త ఆయన భార్య స్వర్ణలత కి చేరడంతో ఆమె వెంటనే దీనిపై స్పందించింది.
సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు తప్పు,బ్రతికిఉండగానే మనిషిని సోషల్ మీడియా లో చంపేస్తున్నారు, మా ఆయన బాగానే ఉన్నాడు, శస్త్ర చికిత్స చేస్తున్నారు, త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యం తో మన ముందుకి రాబోతున్నాడు అంటూ స్వర్ణలత చెప్పుకొచ్చింది. మరోపక్క విజయ్ కాంత్ అభిమానులు తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు మీడియా పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యతగల వృత్తిలో ఉండి కూడా లక్షలాది మంది అభిమానించే ఒక వ్యక్తి పై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు.