Mahesh Babu : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చే హీరోలు కెరీర్ ప్రారంభం లో వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకుంటూ ముందుకు పోవాలి. తన కష్టాన్ని ముందుగా బలంగా నమ్ముకోవాలి, దానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తే హీరోలు గా సక్సెస్ అవుతారు. అలాంటి వారు మన ఇండస్ట్రీలోనే కాదు, పక్క ఇండస్ట్రీ లో కూడా చాలా మంది ఉన్నారు.

వారిలో ముందుగా తమిళ హీరో శివకార్తికేయన్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇతను తోలుట కొన్ని తమిళ సీరియల్స్ లో నటించాడు. ఆ తర్వాత యాంకర్ గా కొన్నాళ్ళు కొనసాగాడు. అలా పాపులారిటీ ని సంపాదించుకున్న శివ కార్తికేయన్ కి ధనుష్ హీరో గా నటించిన ‘3’ అనే చిత్రం లో ధనుష్ స్నేహితుడి పాత్రను పోషించే అవకాశం దక్కింది. ఈ పాత్రకి అప్పట్లో మంచి గుర్తింపు లభించింది.

ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన హీరోగానే నటిస్తూ వచ్చాడు. కొన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి, కొన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన తమిళనాడు లో రజినీకాంత్,అజిత్ మరియు విజయ్ తర్వాత మంచి మార్కెట్ ని సంపాదించుకున్న హీరోగా నిలిచాడు. ఇదంతా పక్కన పెడితే శివ కార్తికేయన్ గతం లో మహేష్ బాబు హీరో గా నటించిన సినిమాలో కమెడియన్ రోల్ చేసే అవకాశం ని దక్కించుకున్నాడట. ఆ సినిమా మరేదో కాదు, మహేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన దూకుడు చిత్రం. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ క్యారక్టర్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

ఈ పాత్ర కి తోలుట శివ కార్తికేయన్ తోనే కొన్ని రోజులు షూటింగ్ చేశారట. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఆయనకీ హీరో గా అవకాశం రావడం,వెంటనే డేట్స్ కావాలి నిర్మాత అడగడంతో, దూకుడు మూవీ టీం ని రిక్వెస్ట్ చేసుకొని ఆ సినిమా నుండి తప్పుకున్నాడట. ఈ సినిమాలో ఆ రోల్ ని వదులుకొని మంచి పనే చేసాడు. లేకపోతే శివ కార్తికేయన్ కి అలాంటి రోల్స్ పలకరిస్తూ ఉండేవి, హీరో గా ఇంతటి స్టార్ స్టేటస్ చూసేవాడు కాదని అంటున్నారు నెటిజెన్స్.
