Tamannaah : ఇప్పుడల్లా పెళ్లి చేసుకోను.. కానీ, విజయ్ వర్మతో అలానే ఉంటానంటున్న తమన్నా..

- Advertisement -

Tamannaah : స్టార్‌ హీరోయిన్ తమన్నా బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తమన్నా స్పందించారు. ప్రస్తుతం ఆమె కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘గత ఐదునెలల్లో నేను నటించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆరు విడుదలయ్యాయి. ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతున్నారు. ఈ విషయంలో వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. వాళ్ల కోసం నేను శక్తిమేర కష్టపడతాను. ఒక నటిగా ప్రస్తుతం ఉత్తమమైన దశలో ఉన్నా. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

Tamannaah
Tamannaah

ఇక పెళ్లి విషయానికొస్తే.. వివాహ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటాను. ప్రస్తుతానికి నా కెరీర్‌పై దృష్టి పెట్టాను. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ’’ అని అన్నారు. ఇక గతంలోనూ తమన్నా తన పెళ్లిపై ఆసక్తికర విషయాలను చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి అనేది చాలా ముఖ్యమైన బాధ్యత. మనకు నచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు.. ఆ బాధ్యతకు మనం సిద్ధంగా ఉన్నప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టాలి.

పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు.. అది చాలా కాలం కలిసి ఉండే విషయం. అందుకే ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నా కెరీర్‌ ప్రారంభమైనప్పుడు 10 ఏళ్లు బిజీగా ఉంటానని నేను భావించాను. 30 ఏళ్లకు పెళ్లిచేసుకుని పిల్లల్ని కనాలని కూడా ప్రణాళిక వేసుకున్నాను. కానీ ఆ తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఈ విషయంలో నేటి తరాన్ని ప్రశంసించాలి. మనుపటి తరం లాగా ఒకరిని చూసి వారు అభిప్రాయాలను మార్చుకోవడం లేదు. నేను కూడా మొదట్లో పక్కవారి ఆలోచనలకు ప్రభావితమయ్యేదానిని. కానీ.. ఇప్పుడు అలా లేదు. ప్రతి విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను’’ అని చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here