Tamannaah : తెలుగులో తమన్నా సినిమాలు పెద్దగా లేక పోయిన కూడా గత కొన్ని రోజుల నుంచి ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది..బాలివుడ్ నటుడు విజయ్ వర్మతో Tamannaah రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తుందని, వీరిద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి.. అందుకు కారణం కూడా లేకపోలేదు. మొన్నీనధ్య గోవాలో వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. న్యూ ఇయర్ పార్టీలో ఒకరినొకరు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది..
అలాగే తమన్నా, విజయ్ వర్మ సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా తెగ ట్రెండ్ అయ్యాయి. దాంతో వీరి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు తమన్నా మాత్రం స్పందించలేదు. అలాగే ఖండించనూ లేదు. దీంతో చాలామంది ఈ వార్తలు నిజమే అని నమ్ముతున్నారు. అయితే విజయ్ వర్మతో రిలేషన్ గురించి పక్కన పెడితే.. న్యూ ఇయర్ పార్టీలో తమన్నా ధరించిన డ్రెస్ ధర ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది..
థైస్ కనిపిస్తూ పైకి వున్న పింక్ కలర్ లో మిల్క్ బ్యూటీ తమన్నా మరింత అందంగా తయారైంది..స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..నిజానికి హీరోయిన్లు వేసుకొనే డ్రెస్సులు చాలా ఖరీదైనవే అయిన తమన్నా వేసుకున్న డ్రెస్ ధర మాత్రం రూ. 2,27,830 అని తెలుస్తోంది. గతంలో కరణ్ జోహర్ బర్త్డే వేడుకల్లో కూడా తమన్నా ఈ డ్రెస్ ను వేసుకోవడం జరిగింది. చాలా సింపుల్ గా ఉన్న తమన్నా డ్రెస్ ఖరీదు అంతా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు..ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా భోళా శంకర్
సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ చెయ్యనుంది..