Tamannaah Bhatia : తన నటనతో అందరి హృదయాలను శాసించే రణదీప్ హుడా తన చిరకాల స్నేహితురాలు లిన్ లైష్రామ్‌ను నవంబర్ 30న మణిపూర్‌లో వివాహం చేసుకున్నాడు. మెయిటీ ఆచారాలతో వారిద్దరూ ఒకటయ్యారు. ఇటీవల ముంబైలో వీరిద్దరి రిసెప్షన్ పార్టీకి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ రిసెప్షన్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే లిన్ లైష్రామ్ లేటెస్ట్ స్టైల్ చూసి అభిమానుల రియాక్షన్స్ తెరపైకి వస్తున్నాయి.

రణదీప్ హుడా గ్రాండ్ రిసెప్షన్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ రిసెప్షన్ పార్టీకి తమన్నా భాటియా, విజయ్ వర్మ, అమిత్ సియాల్, ఊర్వశి రౌతేలాతో సహా చాలా మంది తారలు హాజరయ్యారు. అయితే వీళ్లందరి కంటే కూడా రణదీప్ హుడా భార్యతో తమన్నా భాటియా ఎలా డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. రిసెప్షన్లో, తమన్నా భాటియా రణదీప్ హుడా భార్య లిన్ లైష్రామ్‌తో డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

లిన్ లైష్రామ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. రిసెప్షన్ పార్టీలో లిన్ రెడ్ కలర్ చీరలో చాలా అందంగా కనిపించింది. ఈమె 2007లో ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఓం కపూర్ స్నేహితుడి అతిథి పాత్రలో నటించారు. దీని తరువాత లిన్ లైష్రామ్ ప్రియాంక చోప్రా నటించిన ‘మేరీ కోమ్’లో కూడా కనిపించింది. లిన్ లైష్రామ్ ‘ఉమ్రికా’లో ఉదయ్ భార్య పాత్రలో.. కంగనా రనౌత్ నటించిన ‘రంగూన్’లో మేమా పాత్రలో నటించి పాపులారిటీ సంపాదించుకుంది.