హిందీలో రూపొందిన ‘లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ సిరీస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. టీజర్‌తోనే ప్రేక్షకుల్లో ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో విజయ్ వర్మ, తమన్నా రొమాన్స్‌ను పీక్‌లో చూపించారు. ఇందులో వీరిద్దరూ మాజీ లవర్స్ పాత్రల్లో నటించగా.. జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేందుకు ఇంట్రెస్టింగ్ ప్రోమోలు రిలీజ్ చేస్తు్న్నారు మేకర్స్.

‘లస్ట్ స్టోరీస్ 2’ లో ఇంకా ఘాటైన బెడ్ రూమ్ సీన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తమన్నా కూడా నిజమే అన్నట్టు కామెంట్లు చేసింది. ‘నేను కూడా మారాల్సిన టైం వచ్చింది. విజయ్ వర్మతో నటించడం వల్ల.. బోల్డ్ సన్నివేశాల్లో ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. అతను నా జీవితంలోకి ఎంటర్ అవ్వడం నా అదృష్టంగానే భావిస్తున్నాను’ అంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె కామెంట్స్ ను బట్టి.. వీరి బంధం ఇంకా బలపడినట్టు స్పష్టమవుతుంది.

ఇదిలా ఉంటే.. ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌ను ఏ విధంగా చూడాలో లేటెస్ట్ ప్రోమోలో షేర్ చేసుకుంది తమన్నా. అంతేకాదు చూస్తున్నపుడు ఎవరైనా సడెన్‌గా రూమ్‌లోకి వస్తే భయపడిపోయి, పాజ్ చేయొద్దని సూచించింది. ఎందుకంటే ‘కామం’కు మించిన విషయాలు ఇందులో బోలెడన్ని ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ప్రోమో వీడియో ‘లస్ట్ స్టోరీస్ 2’లో తమన్నా, విజయ్ వర్మల రొమాంటిక్ సీన్‌తో ప్రారంభమైంది. ఆ వెంటనే మరో సీన్‌ను పాజ్ చేశారు. ఇదే క్రమంలో ప్రత్యక్షమైన తమన్నా.. ‘లస్ట్ స్టోరీస్2 చూస్తున్నపుడు ఎవరైనా గదిలోకి ప్రవేశిస్తే, భయాందోళన చెంది పాజ్ చేయకండి. డ్రామా, రొమాన్స్, యాక్షన్ కలగలిసిన ఈ సిరీస్‌లో అమ్మ ప్రేమ, అమ్మమ్మ ప్రేమతో పాటు మాజీ లవర్, పని మనిషితో ప్రేమ కూడా ఆవిష్కరిస్తుందది. అందుకే పేరు చూసి మోసపోకుండా అందరికీ చూపించండి అంటూ హితవు పలికింది తమన్నా.