Tamannah : లవర్‌ను పక్కన పెట్టి ఆ హీరోతో తమన్నా రొమాన్స్.. బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. గత కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేస్తుంది. చాలా సినిమాల్లో మిల్కీ బ్యూటీ తన నటన గ్లామర్‌తో అదరగొట్టి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయే సరికి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరం అయింది. తర్వాత శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత వరుసగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కాళిదాసు లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాల ద్వారా అంతగా గుర్తింపు రాలేదు.

తర్వాత నాగ చైతన్యతో 100% లవ్ సినిమా చేసింది. ఈ సినిమాతో తమన్నా ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. భద్రీనాథ్, ఊసరవెల్లి ఇలా స్టార్ హీరోల సరసన నటించింది. ఇక తెలుగులో ఆఫర్స్ రావడం తగ్గిపోయాక తమన్నా ఏకంగా బాలీవుడ్ వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది.

- Advertisement -

అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ తన లవర్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. రీసెంట్‌గా తమన్నా అరణ్మనై4 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ మూవీ సక్సెస్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. అయితే యాంకర్ మీరు అరుణ్మనై4 మూవీని ఎవరితో కలిసి చూడాలి అనుకుంటున్నారు.. ఎవరితో డేటింగ్ వెళ్లడం ఇష్టం అని ప్రశ్నించింది, నాకు షారుఖ్ అంటే ఇష్టం, కాబట్టి తనతో వెళ్లాలి అనుకుంటున్నాను. అలాగే ఆయనతో సినిమా చేయడానికి ఇష్టపడుతానంటూ చెప్పుకొచ్చింది. అందరూ తమన్నా తన లవర్ పేరు చెప్తుందని భావించారు. కానీ తమన్నా మాత్రం స్టార్ హీరో పేరు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. లవర్ పై మోజు తీరినట్లుంది. అందుకే మరో స్టార్ హీరోను లైన్‌లో పెడుతుందని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here