ఐదు ఏళ్ల క్రితం వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాలుగు కథలుంటాయి. ఈ నాలుగు కథలు ఒకదానితో మరొకదానికి అస్సలు సంబంధం ఉండదు. ప్రేమ, వ్యామోహం, శృంగారం లాంటి సబ్జెక్ట్స్ తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. అంతేకాదు, పచ్చి బూతులు, బోల్డ్ సన్నివేశాలతో బాలీవుడ్ లో గతంలో ఎప్పుడూ లేని సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇలాంటి స్టోరీతో సినిమా ఎప్పుడూ రాలేదని చెప్పుకోవచ్చు. కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాల, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో అద్భుత ఆదరణ దక్కించుకుంది.

చాలా కాలం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. ‘లస్ట్ స్టోరీస్-2’ పేరుతో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ‘కాస్ట్ స్టోరీ’ పేరుతో ప్రమోషన్ వీడియో విడుదల అయ్యింది. అందులో తమన్నా ఘాటు మాటలతో ఆశ్చర్యపరిచింది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఈ చిత్రంలో గట్టిగానే రొమాన్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ ప్రమోషన్ వీడియోలో సైతం ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయ్ వర్మతో ముద్దులే కాదు, అంతకంటే ఎక్కువే చేయగలను అంటూ అందరినీ షాక్ కి గురి చేసింది.

ఇక రీసెంట్ గా విడుదలైన ‘లస్ట్ స్టోరీస్-2’ ట్రైలర్ చూస్తుంటే తొలిపార్ట్ కు మించి బోల్డ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కారు కొనేముందు టెస్ట్ డ్రైవ్ చేసినట్లు పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా అంటూ సీనియర్ నటి నీనా గుప్తా చెప్పిన డైలాగ్ ఈ సినిమాలో ఎంత బోల్డ్ కంటెంట్ ఉందో అని. మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో భాగం అవడంతో ఈ ఆంథాలజీ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. టీజర్ లో పెద్దగా బోల్డ్ షాట్స్ ఏమి చూపించలేదు కానీ, తొలిపార్టులో సగం బోల్డ్ ఉన్నా ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ ను రాబడుతుంది.