Actress : హీరోయిన్ టబును తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోలేరు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన కూలీ నెం 1 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది టబు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ వెంటనే నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగువారికి బాగా దగ్గరయింది. ఈ సినిమాతో తను కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ మన్మథుడు నాగ్ తో ఆమెకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి మధ్య ఫ్రెండ్ షిప్ కు మించిన అనుబంధం ఉంది. టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన నాగ్ ఇంట్లోనే మకాం వేస్తుంది. వాస్తవానికి టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జునే కారణమన్న టాక్ కూడా వినిపిస్తోంది.

బాలీవుడ్ లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ కుర్ర హీరోయిన్లకు సైతం పోటీనిస్తోంది. ఈ వయసులో ఇప్పటి ఇంకా నా వయసు నిండా పదహారే అనేలా అందాలను ఆరబోస్తూ అభిమానులను అలరిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న టబు తన అందాలను ఫర్ ఫెక్ట్ షేపులో మెయింటైన్ చేస్తుంటుంది. వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య షేర్ చేసిన ఫొటోల్లో అమ్మడు అదుర్స్ అనిపించింది. నెటెడ్ టీ షర్ట్ లో యమా హాట్ గా కనిపించింది. ఈ వయస్సులో ఇంత హాట్ గా కనిపించడం నీకు తప్పా మరెవరికీ సాధ్యం కాదని ఈ ఫోటోలు చూసిన అభిమానులు అంటున్నారు.
