Kota Bomali : కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి. ఈ ఏడాది అలాంటి సినిమాలే ఎక్కువగా కనిపించాయి. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవడం. చిన్న సినిమాలు ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్స్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. అలా ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రాలలో ఒకటి ‘కోట బొమ్మాలి PS’.
శ్రీకాంత్ హీరో గా నటించిన ఈ చిత్రం సక్సెస్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అసలు హీరో గా శ్రీకాంత్ కి హిట్ వస్తుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. ఆయన వరుసగా క్యారక్టర్ రోల్స్ మరియు విలన్ రోల్స్ చేసుకుంటూ పోతున్నాడు, అలాంటి సమయం లో హీరో గా చేసిన సినిమా హిట్ అవ్వడం అనేది శ్రీకాంత్ కి పెద్ద సర్ప్రైజ్. ఈ చిత్రం విడుదలై 5 రోజులు అయ్యింది, ఈ 5 రోజులకు గాను ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు జరిగింది. శ్రీకాంత్ హీరో గా నటించిన సినిమాలకు ఈ మధ్య కాలం లో ఇంత బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. ‘లింగి లింగి లింగిడి’ అనే పాట పెద్ద హిట్ అవ్వడం వల్లే ఈ సినిమాకి మార్కెట్ లో బజ్ ఏర్పడింది. ఆ తర్వాత విడుదల అయ్యాక మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ రావడం, మౌత్ టాక్ బాగా వ్యాప్తి చెందడం వల్ల ఈ చిత్రానికి వసూళ్లు పెరుగుతూ వచ్చింది.
ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 5 రోజులకు కలిపి దాదాపుగా మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకునేసింది. ఇక రేపటి నుండి ఎంత వసూళ్లు వచ్చిన లాభాలే అన్నమాట. అలా హీరో శ్రీకాంత్ చాలా ఏళ్ళ తర్వాత హీరో గా హిట్ కొట్టడం విశేషం.