Surya : సూర్య నుంచి జ్యోతిక దూరంగా రావడానికి కారణం వీళ్లేనా..!

- Advertisement -

Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇంకోపక్క సూర్య భార్య జ్యోతిక కూడా నటిగా, నిర్మాతగా మంచి ఫామ్ లో ఉంది. ఈ జంట ఈ మధ్యనే ముంబైలో మకాం పెట్టారు. అక్కడే ఒక ఇల్లును కొని అందులోనే ఉంటున్నారు.

సూర్య కుటుంబం ముంబైలో మకాం పెట్టడానికి కారణం.. తండ్రి శివ కుమార్ కు సూర్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడమే అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి చెప్పకుండా సూర్య.. తాము కుటుంబంతో సహా ముంబై లో ఉండడానికి కారణం తమ పిల్లలు అని, వారి చదువుల కోసం ఇక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ జంట ఎప్పుడైతే ముంబైకు వెళ్లిందో అప్పటినుంచి సూర్య మాత్రమే చెన్నైకు ట్రావెల్ చేస్తున్నాడు కానీ, జ్యోతిక ఒక్కసారి కూడా అత్తామామల ఇంటికి రాలేదు. ఈ మధ్య ఆమె సోదరి.. వారి ఇంటికి వెళ్లి ఏదో ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు సమాచారం. అప్పుడు కూడా జ్యోతిక చెన్నై రావడానికి సుముఖత చూపించలేదని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ఇక సూర్య కూడా భార్య ఇష్టాన్ని కాదనకుండా.. రావాలంటే రా .. లేకపోతే బలవంతం లేదు అని చెప్పడంతో జ్యోతిక చెన్నై ముఖం చూడడం లేదని అంటున్నారు. ఇక ఎలాగూ.. జ్యోతిక మంచి బిజీగా మారింది. తమిళ్ మాత్రమే కాకుండా మలయాళ, హిందీ సినిమాలు చేస్తుంది. ఇంకోపక్క ఫిట్ నెస్ ను వదలడం లేదు. బాలీవుడ్ లో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే ఆమె చెన్నై ముఖం చూడదు అని చెప్పుకొస్తున్నారు. మరి సోదరి ఇంట ఫంక్షన్ కు అయినా వస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here