Surekha Vani : సురేఖా వాణి ..సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసినా.. అందం పరంగా, పబ్లిసిటీ పరంగా, పాపులారిటీ పరంగా స్టార్ హీరోయిన్లను మించిపోయే రేంజ్ లో ఉంది. మరి ముఖ్యంగా ఈ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తను పెట్టే పోస్టులను చూస్తే తెలిసి పోతుంది. ఆ సమయంలో తనను విమర్శించే వారికి లెఫ్ట్ రైట్ ఇస్తూనే ఉంది.

సురేఖా వాణి రీసెంట్ గా చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. జోక్ గా చేశారో లేక కావాలనే చేశారో తెలియదు కానీ ఇప్పుడు మగవాళ్లను టార్గెట్ చేస్తూ చేసిన ఫన్నీ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మగవాళ్ళంతా ఒకటే..వాళ్ల బుద్ధంతా ఒకటే.. ఆడపిల్లను చేరేదాకా ఒక్కటి.. చేరిన తర్వాత వేరు..” అని ఓపెన్ గా చెప్పేసింది.

అఫ్ కోర్స్ ఇది ప్రతి అమ్మాయి మనసులో ఉండే మాటే. అయితే సురేఖా వాణి ఓపెన్ గా చెప్పేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. సురేఖా వాణిని ఎవరైనా మోసం చేశారా? అందుకే ఇలా మాట్లాడుతోందా..? అనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!