Sureka Vani : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాల్లో కనిపించింది.. వందలాది సినిమాలలో ఆర్టిస్ట్ గా నటించిన సురేఖవాణి మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో కమెడియన్లకు భార్యగా నటించిన ఈమె కామెడీకి పెద్దగా స్కోప్ లేవకపోవడంతో ఆమెకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. కానీ అడపాదడపా అవకాశాలు బాగానే సంపాదించుకుంటుంది. ఒకప్పుడు ఎమ్మెస్ నారాయణ , బ్రహ్మానందం, కృష్ణ భగవాన్ లాంటివారికి ఈమె భార్యగా నటించి మంచి పాత్రలు కూడా పోషించింది..భార్య పాత్రనే కాదు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది..
అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో మెరుస్తుంది..భర్త చనిపోయిన కూడా తనకు భయం లేదంటూ కూతురును చూసుకుంటుంది.. ఇకపోతే తనకూతురుతో కలిసి మోడరన్ డ్రెస్సులు వేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. పొట్టి బట్టలు వేసుకొని అందాలను పరచడమే.. ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా సరే ఇంకా యవ్వనంగానే మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా పబ్బులు, స్విమ్మింగ్ పూల్, బార్ అంటూ ఎక్కడ చూసినా సరే సందడి చేస్తూ బాగా పాపులారిటీని దక్కించుకుంది. అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది..అయితే భర్త చనిపోయినప్పుటి నుంచి ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె మరో పెళ్ళి చేసుకుంటుందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి..
ఈ విషయం పై తన కూతురు సుప్రీత స్పందించి తన తల్లికి ఇంకొక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలిపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మీడియాతో మాట్లాడి తన తల్లి కోరుకునేవాడు ఒకడు ఉన్నాడు అన్నట్టు గా కూడా కామెంట్లు చేసింది . ఇప్పుడు ఈ క్రమంలోనే సుప్రీతా తన తల్లి సురేఖకు మళ్లీ పెళ్లి చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సురేఖ వాణి ఒక సీనియర్ ప్రొడ్యూసర్ తో పెళ్లికి సిద్ధమయ్యింది అంటూ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి..
ఈ విషయం పై తాజాగా సురేఖా వాణి రెస్పాండ్ అయ్యింది.అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేసింది. తాను ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదు అంటూ తెలిపింది. అయితే సురేఖ వాణి కి రెండో పెళ్లి చేయాలని కూతురు సుప్రీతా మాత్రం బలంగా కోరుకుంటోంది. మరి కూతురు సుప్రీతా కోరిక మేరకు సురేఖ పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి..