Bigg Boss Telugu 7 : ఈమధ్యనే ప్రారంభం అయ్యింది అన్నట్టుగా అనిపించిన బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే 12 వారాలు పూర్తి చేసుకొని 13 వ వారం లోకి అడుగుపెట్టింది. ‘ఉల్టా పల్టా’ క్యాప్షన్ తో మొదలైన ఈ సీజన్, క్యాప్షన్ కి న్యాయం చేస్తూ అద్భుతమైన టాస్కులు, మరి భావోద్వేగ పూరితమైన సంఘటనలతో ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. ఇంతకు ముందు సీజన్స్ లో డైలీ టీఆర్ఫీ రేటింగ్స్ 5 నుండి 6 పాయింట్స్ వరకు వచ్చేవి.

కానీ ఈ సీజన్ మాత్రం 7 నుండి 8 పాయింట్స్ కి తగ్గకుండా వచ్చింది అంటే ఈ సీజన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ సీజన్ లో అమర్ దీప్ లేదా ప్రశాంత్ టైటిల్ ని గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. శివాజీ నిన్న మొన్నటి వరకు ఉండేది కానీ, ఆయన గత రెండు మూడు వారాలు నుండి పూర్తి స్థాయి లో గాడి తప్పడం తో ఆయన ఈ రేస్ నుండి తప్పుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నడుస్తుంది సీజన్ 7 కాబట్టి ముందు సీజన్స్ లో లాగ కాకుండా, ఈసారి టాప్ 7 కంటెస్టెంట్స్ తో గ్రాండ్ ఫినాలే ఉంటుంది అని అంటున్నారు. అంతే కాకుండా గ్రాండ్ ఫినాలే కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచేస్తున్నట్టు సమాచారం. ఆయన చేతుల మీదుగానే విన్నర్ ట్రోఫీ ని గెలుచుకోబోతున్నారట.

మహేష్ బాబు బిగ్ బాస్ ఎపిసోడ్స్ ని మొదటి నుండి ఆసక్తికరంగా గమనిస్తూ వస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2 లో టైటిల్ విన్నర్ గా నిల్చిన కౌశల్ కి ప్రత్యేకంగా ట్విట్టర్ నుండి శుభాకాంక్షలు కూడా తెలియచేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అంతలా గమనిస్తున్నాడు కాబట్టే ఈ సీజన్ ఫినాలే కి ఆయన ముఖ్య అతిథి గా రాబోతున్నాడు. అదే సమయం లో తన గుంటూరు కారం చిత్రానికి ప్రొమోషన్స్ కూడా చేసినట్టు ఉంటుందని మహేష్ ఆలోచన.