Super Star Rajinikanth : చిరంజీవి పై మండిపడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్..ఈయనతో అసూయ మామూలు రేంజ్ లో లేదుగా!

- Advertisement -

Super Star Rajinikanth : కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న నటీనటులతో మాత్రమే కాదు, కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ మరియు మాలీవుడ్ నటీనటులతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండడం మెగాస్టార్ చిరంజీవి కి అలవాటు. తనతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్నోళ్ళని కూడా చిరంజీవి సోదరభావం తో చూస్తారు. కానీ చిరంజీవి మీద మాత్రం కొంతమంది స్టార్ హీరోలు అసూయ తో రగిలిపోతూ ఉంటారు.

Super Star Rajinikanth
Super Star Rajinikanth

ఇప్పుడు ఆ లిస్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. కారణం చిరంజీవి కి పద్మ విభూషణ్ అవార్డు రావడమే. సూపర్ స్టార్ రజినీకాంత్ కి 2016 వ సంవత్సరం లో పద్మ వి భూషణ్ అవార్డు దక్కింది. ఆ సమయం లో చిరంజీవి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రజినీకాంత్ కి శుభాకాంక్షలు తెలిపాడు. ఆయనకీ అవార్డు దక్కితే తనకి దక్కినంత సంతోషం గా ఫీల్ అయ్యాడు.

కానీ రజినీకాంత్ మాత్రం చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డు రావడం పై నోరు మెదపలేదు. ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టు చెప్పలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు.

- Advertisement -

చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డు రావడం పై రజినీకాంత్ లో సంతోషం లేదని, పైగా తన ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు కి ఇవ్వకుండా చిరంజీవి కి ఇచ్చినందుకు రజినీకాంత్ తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డాడని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత మన టాలీవుడ్ తో పాటుగా అన్నీ ఇండస్ట్రీ లకు సంబంధించిన వారు శుభాకాంక్షలు తెలియచేసారు. ఒక్క రజినీకాంత్ తప్ప అని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here