Tamannaah Bhatia : శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా.. తన అందచందాలతో అలరిస్తూ కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది మిల్కీ బ్యూటీ. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. వారితో పాటు టైర్ 2హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఒక్క నానితో మాత్రం నటించలేదు. అయితే గతంలో వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ మూవీ మిస్ అయిందట. అవును, ఇంతకీ ఆ సినిమా మరేదో తెలుసా.. అదే తడాఖా
. ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్థాసాని దర్శకత్వం వహించాడు. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. సునీల్, ఆండ్రియా జర్మియా, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాలో హీరో గా నాగచైతన్యను ఫస్ట్ డైరెక్టర్ కిషోర్ కుమార్ అనుకోలేదట. ఆయన కన్నా ముందు నానినే ఊహించుకుని స్టోరీని రాసుకున్నాడట.

తర్వాత నాని వద్దకు వెళ్లి కథ చెప్పగా ఆయనకు నచ్చలేదని రిజెక్ట్ చేశాడట. నాని వద్దనడానికి కూడా కారణం లేకపోలేదు. అప్పటికే నాని ఒప్పకున్న పాలు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉండడంతో కాల్షీట్లు అడ్జెస్ట్ కాలేదట. దాంతో సున్నితంగానే నాని తడాఖాను వద్దన్నాడట. ఆ తర్వాత నాగచైతన్యకు నచ్చడంతో వెంటనే సినిమా ఒప్పుకుని హిట్ కొట్టేశాడు. అలా నాని, తమన్నా కాంబోలో తడాఖా సినిమా మిస్ అయింది.