Sunil Shetty : ‘పునీత్ రాజ్ కుమార్ మరణానికి కారణం అదే’.. బాలీవుడ్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

- Advertisement -

ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అనారోగ్యం.. మరికొందరు ఆత్మహత్యలు.. ఇంకొందరు యాక్సిడెంట్ లతో మరణిస్తున్నారు. ముఖ్యంగా జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ చాలా మంది యంగ్ నటులు మరణిస్తున్నారు.  ఏడాది క్రితం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వర్కౌట్స్ చేస్తూ హర్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హిందీ నటుడు సిద్ధార్థ్ శుక్లా, కమెడియన్  రాజు శ్రీవాత్సవ, టీవీ యాక్టర్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ, బ్రహ్మ స్వరూప్ మిశ్రా వంటి వారు కూడా ఎక్సర్సైజ్ చేస్తూనో లేదా చేసిన నిమిషాల తర్వాతనో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు.

 

వీళ్ల అకాల మరణం సదరు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. యంగ్ ఏజ్ లోనే ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. వీళ్ల మరణం వారి కుటుంబాల్లో ఎంత విషాదం నింపిందో.. ఇండస్ట్రీకి.. అభిమానులకు కూడా అంతే బాధను కలిగించింది. వీరు హార్ట్ అటాక్ తో చనిపోవడంతో ఒక్కసారిగా అందరూ ఆ కారణంపై ఫోకస్ చేశారు. హెవీగా వర్కవుట్ చేయడమే వీరి ప్రాణాలు తీసిందని భావించారు. అతి వ్యాయామం కూడా మంచిది కాదనే నిర్దరణకు వచ్చారు.

- Advertisement -

 

అయితే బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి.. ఈ నటుల అకాల మరణంపై స్పందించారు. వారి మరణానికి కారణం వర్కవుట్ కాదని తేల్చి చెప్పేశారు. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని.. అది హార్ట్ ఎటాక్ కాదని అన్నారు. బాడీ సహకరించేంత వరకే వారు వర్కౌట్స్ చేశారే తప్ప.. పరిధి దాటి చేసుండరని సునీల్ అన్నారు. వారు తీసుకున్న సప్లిమెంట్స్ – స్టెరాయిడ్స్ లో ప్రాబ్లమ్ ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అంతేకానీ ఎక్కువగా వర్కవుట్ చేయడమనేది దీనికి కారణం కాదని అభిప్రాయపడ్డారు.

స్టెరాయిడ్స్, సప్లిమెంట్స్ ను అధికంగా తీసుకునే వారికి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని.. అది హార్ట్ ఎటాక్ కాదని సునీల్ చెప్పారు. వర్కవుట్స్ చేసేవారు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం.. తగినంత నిద్ర పోవడం కీలకమన్నారు. ఇవి ఆరోగ్య రక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయని సునీల్ శెట్టి వివరించారు. పునీత్ రాజ్ కుమార్ పై గతంలో బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం మాట్లాడుతూ.. ఒత్తిడిలో ఉన్నప్పుడు వర్కవుట్ చేయడమనేది ఆరోగ్యానికి మంచిది కాదని.. దాని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. మనసు బాలేనప్పుడు జిమ్ లో టైం స్పెండ్ చేద్దామనుకుని ఆ ఒత్తిడిలో అతిగా వర్కవుట్ చేయడమనేది ప్రాణాంతకం అని చెప్పారు.

 

బాలీవుడ్ లో ఒకప్పుడు యాక్షన్ హీరోల్లో ఒకరిగా రాణించిన సునీల్ శెట్టి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతున్నారు. మంచు విష్ణు “మోసగాళ్ళు” చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హిందీ నటుడు వరుణ్ తేజ్ “గని” చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రభాస్ “ప్రాజెక్ట్ K” లోనూ భాగం అవుతున్నారని టాక్.

సునీల్ శెట్టి ఇప్పుడు  “ధారవి బ్యాంక్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ స్పేస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఈ నెల 18న విడుదలైంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే జిమ్ చేస్తూ సినీ ప్రముఖుల అకాల మరణం చెందడంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరు పదుల వయసులోనూ ఆయన ఫిట్ గా ఉండటానికి వర్కవుట్స్ చేయడమే కారణమని చెబుతుంటారు.

సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి Rx100 రీమేక్ తడప్ తో హీరోగా లాంచ్ అయ్యాడు. అలానే ఆయన కుమార్తె అతియా శెట్టి హీరోయిన్ గా రాణిస్తోంది. కొన్నేళ్లుగా టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగిస్తున్న అథియా.. తండ్రి అంగీకారంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here