OTT Reviews : ఓటీటీ సెన్సేషన్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ చివరి సీజన్ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!

- Advertisement -

OTT Reviews : ఓటీటీ లో మన తెలుగు ఆడియన్స్ ఇంగ్లీష్, కొరియా, చైనీస్ సినిమాలను లాక్ డౌన్ సమయం నుండి విపరీతంగా చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అది ఒక అలవాటుగా మారిపోయి ఇప్పటికీ ఓటీటీ లో ప్రతీ వారం విడుదలయ్యే వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తూనే ఉన్నారు. అలా ఓటీటీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చిన వెబ్ సిరీస్ లలో ఒకటి స్ట్రేంజర్ థింగ్స్. వయస్సు తో సంబంధం లేకుండా ఈ సిరీస్ ని ప్రతీ ఒక్కరూ ఇరగబడి చూసారు. ఈ సీజన్ లో నటించిన చిన్న పిల్లలు నేడు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు.

OTT Review

చివరి సీజన్ కి సంబంధించిన షూటింగ్ ఏడాది క్రితం మొదలు అయ్యింది. ఈ సీజన్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయట. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సీజన్ నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది జనవరి లో కానీ, లేదా మార్చి నెలలో కానీ ఈ సీజన్ ని స్ట్రీమింగ్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్దిరోజుల క్రితమే చేసారు.

- Advertisement -

Stranger Things season 5: Plot, cast and release date | British GQ

ఈ సిరీస్ చెయ్యడానికి సుమారుగా 340 కోట్ల రూపాయిల బడ్జెట్ అయ్యిందట. ముందు ఉన్న అన్నీ సీజన్స్ కంటే ఈ సీజన్ లో ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు బోలెడన్ని ఉంటాయట. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సిరీస్ తెలుగు లో కూడా అందుబాటులో రానుంది. కేవలం ఈ ఒక్క సీజన్ మాత్రమే కాదు, ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన అన్నీ సీజన్స్ కూడా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సిరీస్ ఇంకా చూడకుండా ఉంటే వెంటనే చూసేయండి, మీకు సరికొత్త అనుభూతి కచ్చితంగా కలుగుతుంది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here