Adivi sesh real name : ఆమె వల్లే అడివి శేష్‌ పేరు మారిందట.. ఈ యంగ్ హీరో అసలు పేరు ఏంటో తెలుసా ?

- Advertisement -

Adivi sesh real name సినిమా ఇండస్ట్రీకి రాగానే చాలా మంది తమ పేర్లు మార్చుకుంటారు. కొందరు ఉన్న పేరు మొత్తం తీసేసి కొత్త పేరు పెట్టుకుంటే.. మరికొందరు తమ పేరులో కొన్ని అక్షరాలు తొలగించడమో లేదా యాడ్ చేయడమో చేస్తారు. అలా స్టార్ హీరోలు, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు చాలా మంది ఇప్పటికే తమ పేర్లు మార్చుకున్నారు. ఇక కొందరైతే తమ కెరీర్ లో ఫస్ట్ హిట్ అయిన క్యారెక్టరో లేదా సినిమా పేరే ఇంటి పేరుగా మారిన వారున్నారు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటయితే, సినిమాల్లోకి వచ్చాక పెట్టుకుంది మరొకటి. ఇలా రెండు పేర్లున్న లిస్టులో టాలీవుడ్ లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, యంగ్ హీరో కూడా ఉన్నాడు. ఆయనే అడివి శేష్‌.

సాధారణంగా అడివి శేష్ పేరు వినగానే చాలా మందికి, డిఫరెంట్‌గా ఉంది అని అనిపిస్తుంది. వాస్తవానికి ఆయన అసలు పేరు అది కాదట. అయితే ఆయన తన పేరును సినిమా అవసరాల కోసం కూడా మార్చుకోలేదు. దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ కథ, ఇంకా ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉన్నారట. మరి ఈ హీరో పేరు వెనక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందామా?

- Advertisement -

గతంలో ఒక ఇంటర్వ్యూలో, తన పేరు మార్చడానికి గల కారణాన్ని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. నిజానికి తన అసలు పేరులో శేష్‌ కూడా లేదట. తాను యూఎస్ లో  ఉన్నప్పుడు, తన పేరు చూసి అక్కడి వారంతా ఆటపట్టించే వారట. అక్కడ సన్నీ డిలైట్ అనే ఆరెంజ్‌ ఫ్లేవర్డ్‌ డ్రింక్‌ ఉంది. అలాగే, సన్నీ లియోన్ పాపులర్ అయిన సమయం అది. తన పేరు అప్పుడు సన్నీ అట. అలా తన పేరులో సన్నీ ఉండటంతో చిన్నపిల్లలు తనను ఆటపట్టించేవారట.

ఇదే విషయం తన తండ్రితో చెబితే తన పేరులో శేష్ కూడా భాగమని,  దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారట.  తన తండ్రి సునీల్ గవాస్కర్‌కి వీరాభిమాని కాబట్టి తనకు సన్నీ అని పేరు పెట్టారట. తర్వాత తను తన పేరు శేష్‌ అనే చెప్పేవాడినని.. భారతదేశానికి వచ్చిన తర్వాత, శేష్ ఒక సాధారణ పేరు అని తెలిసిందని అడివి శేష్ అసలు సంగతి చెప్పుకొచ్చారు. అలా సన్నీ లియోనీ పేరు వల్ల మన టాలీవుడ్ యంగ్ హీరో సన్నీ కాస్త అడివి శేష్ అయ్యాడట.

ఇక అడివి శేష్ సినిమాల సంగతికి వస్తే ఈ హీరో.. మొదటి నుంచి డిఫరెంట్ ట్రాక్ లోనే నడుస్తున్నాడు కేవలం నటించడమే కాదు డైరెక్షన్, రైటింగ్ పైనా మంచి పట్టుంది. దాదాపుగా తన సినిమాలకు తానే కథ రాసుకుంటాడనే పేరుంది.  ‘క్షణం’ మూవీ సక్సెస్‌తో అడివి శేష్ కెరీర్‌ మలుపు తిరిగింది. తర్వాత తన కెరీర్​లో తాను వెనుతిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లు, విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘గూఢచారి’ సీక్వెల్​గా రానున్న ‘జీ2’ షూటింగ్‌లో శేష్‌ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here