Rajamouli : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు రకరకాల వార్తలు వింటూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలుగా పాపులర్ అయిన వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వాళ్ళ నెక్స్ట్ సినిమా ఏంటి.. ఎవరితో తీస్తున్నారు.. అప్డేట్ ఏంటి..? అన్న విషయాలను మనం ఎక్కువగా వింటుంటాం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. దర్శక దిగ్గజం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత జాప్యం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సినిమాలో హీరో ఫిక్స్ అయ్యాడు కానీ.. హీరోయిన్లు ఇంకా ఎవరనేది ఫిక్స్ కాలేదట. రాజమౌళి ఎవరిని హీరోయిన్ గా సెలక్ట్ చేస్తారన్న విషయం బాగా చర్చనీయాంశం అయింది. మహేష్ పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే అదృష్టం ఉండాలి అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా లేదంటే దీపికా పదుకొనెను హీరోయిన్లుగా అనుకున్నారట రాజమౌళి. ఎప్పుడైతే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అని తెలిసే సరికి ఆమె పేరు లిస్టు నుంచి తీసేశారట. ఆమె స్థానంలో మరో క్రేజీ హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్న రాజమౌళికు ఓ ప్రొడ్యూసర్ పదేపదే కాల్ చేసి తన కూతురిని హీరోయిన్ గా చూస్ చేసుకోమంటూ సజెస్ట్ చేస్తున్నారట.
ఆయన మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్. ఈ సినిమాలో తన కూతురు జాన్వీని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని రాజమౌళిని హై రికమండేషన్స్ తో ఒత్తిడి పెడుతున్నాడట. అయితే రాజమౌళి చాలా మొండిగా ఉంటాడు. తన కథ విషయంలో తాను అనుకున్న నటీనటులనే ఎంపిక చేసుకుంటారు. అయితే మహేష్ పక్కన జాన్వీ కపూర్ ఏ మాత్రం సెట్ కాదంటున్నారు జనాలు.
అంతేకాదు ఇలాంటి భారీ అడ్వెంచర్స్ ప్రాజెక్టులో ఇంత లేత బ్యూటీ ని పెడితే సినిమాకి నెగటివ్ క్రియేట్ అవుతుందని టాక్. రాజమౌళి సైతం ఈ సినిమాకు జాన్వీని తీసుకోవాలని అనుకోవడం లేదట. అందుకే ఈ సినిమాలో మరో గ్లోబల్ బ్యూటీని రంగంలోకి దించడానికి ఆసక్తి చూపుతున్నారట . దిశా పటానీ ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే కల్కి సినిమాలో ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది దిశాపటాని. చూద్దాం ఆ పాత్ర కోసం జాన్వీ సెలెక్ట్ అవుతుందో..? దిశా పటాని ఫైనలైజ్ అవుతుందో..?