Sonam Kapoor : గడ్డం చేసుకుంటూ అడ్డంగా బుక్కయిన స్టార్ హీరోయిన్.. నీ బ్యూటీ సీక్రెట్ ఇదా !

- Advertisement -

Sonam Kapoor : బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ ఫుల్ జోష్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది. ప్రజెంట్ ఆ బిడ్డ ఆలనపాలన చూసుకుంటూ మాతృత్వపు మధురిమలు ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత తాను సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. పెళ్లి చేసుకుని తల్లి అయినా కూడా కొంతమంది సెలబ్రెటీలు ఇంకా హాట్ హాట్ అందాలతో యువతకు మత్తెక్కించే పనిలో ఉన్నారు. సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ ను పెంచుతూనే ఉన్నారు. అందుకే హిరోయిన్ల ఇన్ స్టాగ్రాం లలో వాళ్లకు పాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వారి జాబితాలో సోనమ్ కపూర్ కూడా ఒకరు.

అనిల్ కపూర్ కూతురుగా 2006లో సవారియా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అనంతరం ఢిల్లీ 6, ఐషా, థాంక్యూ, మాసమ్, తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. గతంలో కాస్త బొద్దుగా అయినా ఈ అమ్మడు.. ప్రజెంట్ నాజూకు అందాలతో అదరహో అనిపిస్తుంది.

- Advertisement -

సోనమ్ కపూర్ నెట్టింట్లో ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె పెట్టిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్‌కు గురవుతున్నాయి. షేవింగ్ చేసుకుంటున్నట్లుగా ఉన్న కొన్ని పాత ఫొటోలను ఆమె ఫేస్‌బుక్ లో షేర్ చేసింది. 2014 వ సంవత్సరంలో దిగిన ఈ ఫొటోలను తాజాగా ఆమె మరోసారి షేర్ చేయడంతో.. అవి వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అంతే కాకుండా ఆమె బ్యూటీ సీక్రెట్ ఇదే అనుకుంటా అంటూ వంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here