Trivikram : అవును ప్రస్తుతం ఈ వార్త ఇటు సోషల్ మీడియాలో.. అటు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్ ఎంత పెద్ద డైరెక్టరో అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలామంది హీరోహీరోయిన్లు కోరుకుంటారు. తన సినిమాలో ఛాన్స్ వస్తే కెరీర్ బాగా సాగుతుందని చాలా మంది నమ్మకం. అలాంటి త్రివిక్రమ్ నే తన సినిమాలో చేస్తున్నానన్న సంగతి కూడా మర్చిపోయి ఓ హీరోయిన్ ఆయనను గడగడలాడించింది అంట. ఏకంగా షూటింగ్ స్పాట్ లోనే ఆయనకు ఇచ్చి పడేసిందట. దీంతో స్పాట్లో ఉన్న వాళ్లంతా షాక్ అయిపోయి చూస్తుండిపోయారట.

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు బయటైనా, షూటింగ్ లో అయినా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. తనకు కావాల్సిన వాళ్లతోనే.. అది కూడా ఎంత మాట్లాడాలో అంతలోనే మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఓ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఫన్నీ జోక్స్ ఆమెకు చిరాకు తెప్పించి.. ఎక్కడో కాలేలా చేశాయట. ఆమె పర్సనల్ ఇష్యూను లాగి అందరి ముందు నవ్వుల పాలు చేశాడట త్రివిక్రమ్.. దీంతో ఆమెకు మండిపోయిందట. దీంతో స్ట్రైట్ గా ఆయన దగ్గరకే వెళ్లి తన డైరెక్షన్లోనే సినిమా చేస్తున్నానన్న సంగతి కూడా మర్చిపోయి.. ‘‘నీ డబుల్ గేమ్స్ ఇక్కడ చెల్లవ్.. గుర్తుపెట్టుకో ” అంటూ ఇచ్చిపడేసిందట. పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్న త్రివిక్రమ్ కామోష్ అయిపోయాడట. ఆ దెబ్బకి ఆయన రెండు రోజుల పాటు షూట్ క్యాన్సిల్ చేసేసారట. ఆ తర్వాత నిర్మాతలు ఆమెను ఒప్పించి సినిమా ఫినిష్ చేశారట. అలా ఆ హీరోయిన్ త్రివిక్రమ్ కు చెమటలు పట్టించేసిందట.