ఒక సినిమా భారీ విజయాన్ని అందుకుంటే ఆ తర్వాత సినిమాకు హీరో రెమ్యూనరేషన్ పెంచడం కామన్.. స్టార్ హీరోలు నెక్స్ట్ సినిమాకు ఒక రూ.10 లేదా రూ.20 కోట్లు పెంచడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఏకంగా రూ.100 కోట్లు పెంచడం అంటే మామూలు విషయం కాదు.. ఆ హీరో ఎవరో కాదు తమిళ స్టార్ హీరో అజిత్.. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా అజిత్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు..
అజిత్ లాస్ట్ సినిమా వరకు రూ.70 నుంచి 90 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.. ఇప్పుడు ఆయన నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కోసం ఏకంగా రూ .101 కోట్లు పెంచేసి.. ఈ సినిమా కోసం రూ .171 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక్క సినిమా కోసం ఈ రేంజ్ లో పారితోషకం అంటే నిజంగా షాక్ అనే చెప్పాలి.. రజినీ కాంత్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోల తర్వాత అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ అజిత్..
హీరో అజిత్ చదివింది కేవలం పదోతరగతి అయిన కూడా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు కూడా.. ఒక్క హీరోగా మాత్రమే కాదు మంచి రైడర్ కూడా.. బైక్ రైడ్ చేస్తూ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.. మొదట మెకానిక్ గా కేరీర్ ను ఆరంభించిన ఆయన 1992లో ప్రేమ పుస్తకం అనే సినిమాతో తొలి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.. ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..