Kajal Aggarwal : స్టార్ హీరోయిన్ కాజల్ కోసం రూమ్ బుక్ చేసిన స్టార్ హీరో.. తను ఫుల్ హ్యాపీనట

- Advertisement -

Kajal Aggarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. చందమామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో కాజల్ తలరాత మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల అందరి సరసన నటించింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్, రవితేజ వంటి స్టార్ హీరోస్ అందరితో జత కట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేసేందుకు సైతం ఓకే అంటోంది.

సినిమా అంటేనే సముద్రం. ఆ ఇండస్ట్రీలో పరిచయాలు కావాలి.. అందుకే ఒక్కొక్కరికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కొక్కరి ఫ్రెండ్షిప్ ఒక్కొక్క స్టైల్ లో ఉంటుంది. కొంతమంది బాగా మింగిల్ అయిపోతుంటారు. ఒకే కంచం ఒకే మంచం అన్న రేంజ్ లో ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు . అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి కొన్ని కొన్ని సార్లు కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా గతంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు హీరోతో మెలిగిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది.

- Advertisement -

Kajal Aggarwal

వాస్తవానికి కాజల్ అగర్వాల్ స్నేహానికి చాలా వాల్యూ ఇస్తుంది. అలా తన క్లోజ్ ఫ్రెండ్, హీరోతో చాలా కలివిడిగా ఉండేది. అలాగే ఆ హీరోకు కూడా కాజల్ అంటే చాలా ఇష్టం అంట. తన బర్త్ డే రోజు ఏకంగా, ఓ రూమ్ బుక్ చేసి తన ఫ్రెండ్స్‌తో పార్టీని సెలబ్రేట్ చేశాడంట. దీంతో ఆ నైట్ కాజల్ చాలా సంతోషంగా ఫీల్ అయిదంట. ఆరోజు సెలబ్రీటీస్, ఫ్రెండ్స్‌తో కాజల్ అగర్వాల్ చాలా సంతోషంగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. అయితే కాజల్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హీరోకి దూరం కావడం అప్పట్లో అభిమానులకి ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here