అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే.. డెటాల్ తో కడుకున్న స్టార్ హీరో

- Advertisement -

సాధారణంగా సెలబ్రిటీల్లో సినిమా వాళ్లకు ఉండే ప్రాధాన్యం మరెవరికీ ఉండదు. జనాలు సినిమా వాళ్లంటే పడిచచ్చిపోతుంటారు. వారు ఎక్కడ కనిపించినా గుంపులు గుంపులుగా పొగవుతారు. వాళ్లకు ఇంట్లో పెద్దవాళ్లకన్నా కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటారు. తమ అభిమాన తార బర్త్ డే వచ్చిందంటే ఆ హడావుడి మామూలుగా ఉండదు. వాళ్లతో ఫొటోస్ దిగడానికి తెగ ఎగబడి పోతుంటారు. కొంతమంది హీరోలు కూడా తమ అభిమానులను దగ్గరకు తీసుకుని మెచ్చుకుంటుంటారు. మరి కొందరు మాత్రం అభిమానుల్ని అస్సలు కేర్ చేయరు. అయితే అదే లిస్టులోకి చేరిపోయాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటూ లేటెస్ట్‎గా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అజిత్
అజిత్

మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానులను సంపాదించుకున్న హీరో అజిత్. ఎంతో సింపుల్ గా కనిపించే అజిత్ చేసిన పనికి నెటిజన్లు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నెట్టింట్లో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అజిత్ ఓ దగ్గర తన అభిమానులను కలిశారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. చాలా ఆప్యాయంగా వారు ఆయనతో ముచ్చటించారు. అప్పటి వరకు బాగానే ఉంది.

Ajith

సదరు అభిమానులు వెళ్లిపోయిన తర్వాత ఆయన తన చేతులను డెటాల్ తో కడుక్కున్నారు. ఈ క్రమంలో ఎవరో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అజిత్ పై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. అభిమానులు లేకపోతే నీకు ప్రస్తుతం అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ ఎక్కడిదంటూ మండిపడుతున్నారు. ‘డెటాల్ తో నీ చేతులను కాదు నీ మనసును శుభ్రం చేసుకో’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com