Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత సుమారుగా ఆరేళ్ళ పాటు ప్రభాస్ ఫ్యాన్స్ హిట్ కోసం ఎదురు చూసారు. మొత్తానికి వాళ్ళ ఆకలికి తగ్గట్టుగా సూపర్ హిట్ పడింది.
ఇప్పుడు ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిలను కొల్లగొడుతుందా?, లేదా ఇంకా ఎక్కువ వసూళ్లను రాబడుతుందా అనేది మాత్రమే చూస్తున్నారు ట్రేడ్ పండితులు. కేవలం రెండు రోజుల్లోనే 250 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మొదటి వారం లోనే అత్యధిక ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ మార్కుని చేరుకొని సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాకి వస్తున్న వసూళ్లను చూసి బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ అసూయ తో రగిలిపోతున్నాడు అట.
ఎందుకంటే షారుఖ్ ఖాన్ హీరో గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘డుంకీ’ చిత్రం ‘సలార్’ కి ఒక రోజు ముందు విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి పర్వాలేదు అనే రేంజ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ప్రభాస్ సలార్ మూవీ మేనియా ఒక రేంజ్ లో కొనసాగుతుండడం వల్ల డుంకీ చిత్రం పై చాలా గట్టి ప్రభావమే పడింది.
ఫలితంగా చాలా చోట్ల డుంకీ చిత్రాన్ని తీసేసి, ప్రభాస్ సలార్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది షారుఖ్ ఖాన్ అహం ని దెబ్బతీసింది. రీసెంట్ గా జరిగిన ‘డుంకీ’ సక్సెస్ పార్టీ లో షారుఖ్ ఖాన్ ఫేక్ కలెక్షన్స్ తో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని, మన సినిమాకి మొన్న విడుదలైన చిత్రంకంటే లాంగ్ రన్ చాలా బలంగా ఉంటుందని పరోక్షంగా సలార్ చిత్రం పై తన టీం తో కామెంట్ చేసాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.