టాలీవుడ్ కి హీరోయిజం లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి దర్శకుల లిస్ట్ తీస్తే అందులో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బద్రి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని ఆడియన్స్ కేవలం లవ్ స్టోరీస్ లోనే చూసారు.

ఆయనలోని మాస్ యాంగిల్ ని బయటకి తీసిన మొట్టమొదటి డైరెక్టర్ మాత్రం పూరి జగన్నాథ్ మాత్రమే. ఈ సినిమాలో పవన్ తో చేయించిన మ్యానరిజమ్స్ ఇప్పటికీ ఫేమస్. ఇక ఆ తర్వాత మహేష్ బాబు తో ‘పోకిరి’ , ‘బిజినెస్ మేన్’, రవితేజ తో ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, రామ్ చరణ్ తో ‘చిరుత’,అల్లు అర్జున్ తో ‘దేశముదురు’,రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసి మాస్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అయితే గత ఏడాది ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన ‘లైగర్’ చిత్రం మాత్రం కమర్షియల్ గా అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్ 2 ‘ అనే చిత్రం చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే పూరి జగన్నాథ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ ప్రారంభం లో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో పూరి జగన్నాథ్ ని డైరెక్టర్స్ తమ సినిమాలకు కథలు, మరియు కొన్ని కీలక సన్నివేశాలు రాయించే వారట.

కానీ క్రెడిట్స్ మాత్రం పూరి జగన్నాథ్ కి ఇచ్చేవారు కాదు. పోనీ డబ్బులైన బలంగా ఇస్తున్నారా అంటే, ఆ కథలతో వాళ్ళు కోట్ల రూపాయిలు సంపాదించుకొని, పూరి చేతిలో వంద రూపాయిలు పెట్టేవారట. అలా వంద రూపాయిల కోసం అప్పట్లో కథలు రాసే స్థాయికి దిగజారాడు పూరి జగన్నాథ్. ఇక అప్పట్లోనే ఒక ప్రైవేట్ మ్యాగజైన్ లో వచ్చే కార్టూన్ స్టోరీస్ ని కూడా పూరి జగన్నాథ్ రాసేవాడట. ఒక్కో స్టోరీ కి 50 రూపాయిలు ఇచ్చేవారట ఆరోజుల్లో, ఇలా ఆయన కెరీర్ ప్రారంభం కాకముందు ఇన్ని కష్టాలను అనుభవించాడు.