Bigg Boss 8 Promo : బిగ్ బాస్ 8 ప్రోమో లో కనిపించబోతున్న స్టార్ కమెడియన్..ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరే రేంజ్ అప్డేట్!

- Advertisement -

Bigg Boss 8 Promo కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సరికొత్త సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సీజన్ కి సంబంధించిన లోగో ప్రోమో ని విడుదల చేసారు. గత రెండు రోజుల క్రితమే నాగార్జున తో కలిసి మెయిన్ ప్రోమో ని షూట్ చేసారు. శనివారం కొంత భాగం షూటింగ్ చెయ్యగా, సోమవారం మరికొంత ప్రోమో షూటింగ్ జరిగింది. ఈ ప్రోమో ద్వారా సీజన్ 8 కాన్సెప్ట్ ఏంటో ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చెయ్యనున్నారు మేకర్స్. గత సీజన్ ఉల్టా పల్టా కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సాగిన సీజన్ 7 బంపర్ హిట్ అయ్యింది. మళ్ళీ అదే తరహా కొత్త ఆలోచనతో సీజన్ 8 రాబోతుంది.

Bigg Boss 8 Promo
Bigg Boss 8 Promo

ఈ సీజన్ లో రెండు బిగ్ బాస్ హౌస్లు ఉంటాయి అని ఇన్ని రోజులు వినిపిస్తున్న రూమర్స్ కి కూడా ఈ ప్రోమో క్లారిటీ ఇవ్వనుంది. ఆగష్టు 2 వ తేదీన ఈ ప్రోమో ని విడుదల చేసేందుకు రెడీ గా ఉన్నారు బిగ్ బాస్ టీం. ఈ ప్రోమో లో ప్రముఖ స్టార్ కమెడియన్ సత్య కూడా నాగార్జున తో పాటు కనిపిస్తారట. ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్స్ ఈసారి మనకి దర్శనం ఇవ్వబోతున్నారని, పాత కంటెస్టెంట్స్ కూడా ఈ సీజన్ లో అధికంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని. పాత కంటెస్టెంట్స్ ఒక హౌస్ లో, అలాగే కొత్త కంటెస్టెంట్స్ మరో హౌస్ లో ఉండబోతున్నారని.

Nagarjuna Akkineni Hosts Bigg Boss Telugu 8: Launch Date, Promo Release, Contestant List, & Everything You Need To Know

- Advertisement -

పాత కంటెస్టెంట్స్, కొత్త కాంటెస్టన్స్ ఉండే హౌస్లలో ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పటి లాగానే అతి తక్కువ ఓటింగ్ ని బట్టే ఎలిమినేషన్ ఉంటుంది కానీ, ప్రతీ వారం హౌస్ లో అందరికంటే తక్కువగా గేమ్స్ ఆడిన వారిని పాత కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ నుండి కొత్త కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ కి పంపడం, అలాగే కొత్త కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ లో బెస్ట్ గా టాస్కులు ఆడిన వారిని పాత కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ లోకి పంపడం, ఇలా చాలా డిఫరెంట్ గా ఈ సీజన్ ని ప్లాన్ చేశారట. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇది వరకే మీ అందరికీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతున్న పేర్లు తెలిసే ఉంటాయి. మరి ప్రచారం లో ఉన్న ఆ కంటెస్టెంట్స్ లో ఎంతమంది హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారో చూడాలి.

Bigg Boss Telugu 8: బిగ్‏బాస్ 8 ప్రోమో వచ్చేసింది.. అసలు విషయం చెప్పేసిన హోస్ట్ నాగార్జున.. - Telugu News | Nagarjuna Shared Bigg Boss Season 8 Telugu Promo, watch the video | TV9 Telugu

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here