Bigg Boss 8 Telugu మరో రెండు వారాల్లో స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి రెండు ప్రోమో టీజర్స్ ని విడుదల చేసారు. ఈ ప్రోమో టీజర్స్ ద్వారా ఈ సీజన్ కాన్సెప్ట్ ని ప్రేక్షకులకు వివరించారు. గత సీజన్ లో ‘ఉల్టా పల్టా’ లాగ ఈ సీజన్ లో ‘ఇన్ఫినిటీ’ అనే కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. ఇన్ఫినిటీ అంటే అనంతం. ఎంటర్టైన్మెంట్, టాస్కులు,గొడవలు అన్నీ అన్ లిమిటెడ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్స్ ఇంకా ప్రారంభం అవ్వలేదట. సోమవారం నాడు ఈ హౌస్ సెట్ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
ఇకపోతే ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి మన అందరికీ ఒక అవగాహనా వచ్చింది. తేజస్విని గౌడా, రీతూ చౌదరీ, జబర్దస్త్ నరేష్, అంజలి పవన్, బంచిక్ బబ్లూ , ఆదిత్య ఓం ఇలా ఎంతో మంది పేర్లు విన్నాము. వీరితో పాటు ఒకప్పుడు పాపులర్ హీరో గా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న అబ్బాస్ ని బిగ్ బాస్ లోకి తెచ్చేందుకు యాజమాన్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తునం సంగతి అందరికీ తెలిసిందే. అయితే రెమ్యూనరేషన్ విషయం లో భేరం ఇంకా కుదరకపోవడంతో అబ్బాస్ ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెడుతాడా లేదా అనేది ఇప్పటి వరకు ఇంకా ఖరారు కాలేదు.
ఈ సీజన్ లో మొత్తం 16 వారాలకు గాను ఆయన కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఒక్క విషయం లోనే అబ్బాస్ ఇంకా ఖరారు కాలేదు. అబ్బాస్ కి ముందు నుండే ప్రీ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి, ఆయన బాగా ఆడినా ఆడకపోయినా టాప్ 5 లో కచ్చితంగా ఉంటాడు. బాగా ఆడితే విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అబ్బాస్ కి తెలుగు రాకపోవడంతో బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తుంది. తెలుగు బిగ్ బాస్ కంటే ఆయన్ని తమిళ బిగ్ బాస్ లోకి పంపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది.