Bigg Boss : ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో ఒక ప్రభంజనమే సృష్టించింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో. అయితే ఈ సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అంతే వివాదాలను కూడా మూటగట్టుకుంది. గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన సంఘటనల దగ్గర నుండి, అరెస్టులు, కేసులు అంటూ మొత్తం షోనే చిక్కులో చిక్కుకుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టాలనే ఆశ కోరిక తో ఒక వ్యక్తిని నమ్మి మూడు లక్షల రూపాయిలను పోగొట్టుకుంది ప్రముఖ యాంకర్ స్వప్న చౌదరీ. తెలంగాణ ప్రాంతం లోని ఖమ్మం జిల్లాకి చెందిన స్వప్న, యాంకర్ గా, ఈవెంట్ ఆర్గనైజర్ గా అలాగే పలు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించింది. అయితే ఈమెకి బిగ్ బాస్ రియాలిటీ షో అంటే పిచ్చి.

ఎలా అయినా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాలనే ఆరాటం తో తమ్మాలి రాజు అనే వ్యక్తిని నమ్మి మూడు లక్షల రూపాయిలను ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు బిగ్ బాస్ షో అంటే ప్రాణం..ఈ షో లో ఎలా అయిన పాల్గొనాలని కలలు కనేదానిని. ఇంట్లో ఉన్నప్పుడు పడుకున్న కూర్చునా నాకు బిగ్ బాస్ లో ఉన్నట్టుగానే అనిపించేది. నాలో ఉన్న ఈ అమితాసక్తిని తమ్మిలి రాజు అనే వ్యక్తి ఉపయోగించుకున్నాడు. నిన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపే బాధ్యత నాది అంటూ నా దగ్గర మూడు లక్షల రూపాయిలు తీసుకున్నాడు. ఈ డబ్బులతో నీకు ప్రతీ శనివారం వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ ని పంపుతాను అని చెప్పాడు. అతను చెప్పిన మాటల్ని నేను నిజం అనుకోని నమ్మాను. అయితే సీజన్ ప్రారంభం అయ్యింది, అతని నుండి ఎలాంటి స్పందన లేదు. సరిగా నా ఫోన్ కి కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. బిగ్ బాస్ లో అవకాశం ఇప్పించలేకపోతే నాకు ఇచ్చిన డబ్బులను తిరిగి డిసెంబర్ లో ఇస్తా అన్నాడు. డిసెంబర్ దాటి జనవరి వచ్చింది, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే పైసా కూడా ఇవ్వను, ఎండి చేసుకుంటావో చేసుకో అంటున్నాడు’ అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది.
