Sreemukhi : సెలబ్రిటీ అన్నాక వారిపై పుకార్లు పుట్టడం సహజం. అయినప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదన్న నానుడి గుర్తుండే ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే రూమర్స్ లో ఎక్కడో ఓ మూల అయినా చిన్న వాస్తవం ఉండొచ్చు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే వారితో ఆ న్యూస్ హల్చల్ చేస్తుంటుంది. తాజాగా యాంకర్ శ్రీముఖి విషయంలో అలాంటి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోతో శ్రీముఖి పీక్కల్లోతు ప్రేమలో ఉందని, ఈ ఇద్దరూ రహస్యం డేటింగ్ చేస్తున్నారనే న్యూస్ మీడియాలో షికార్లు కొడుతోంది.
దాదాపు అన్ని టీవీ చానల్స్ లో యాంకర్ గా చేస్తూ.. బుల్లితెరపై బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి. ఓ వైపు బుల్లితెర ప్రోగ్రామ్స్, మరోవైపు ఓటీటీ హోస్టింగ్ తో అదరగొడుతుంది ఈ అందాల భామ. మూడు పదుల వయసు మీదపడిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి ముచ్చట గురించి మాట్లాడదేంటని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలే గతంలో ఓ సారి ప్రేమలో విఫలమై మనసు ముక్కలు చేసుకున్న ఈమె మళ్లీ ఎవరితోనైనా మింగిల్ అయ్యిందా..? లేక లైఫ్ లాంగ్ సింగల్ గా ఉండిపోవాలని డిసైడ్ అయిందా లాంటి అనేక చిక్కు ప్రశ్నలకు శ్రీముఖి చెక్ పెట్టిందని ప్రచార నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీముఖి ఓ యంగ్ హీరోతో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇన్నాళ్లు సీక్రెట్ గా మెయింటైన్ చేసిన వాళ్ల రిలేషన్ షిప్ గురించి ఇంట్లో తెలిసిపోయిందట. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు కూడా వారి రిలేషన్ షిప్ ను యాక్సెప్ట్ చేశారని సమాచారం. ఇక శ్రీముఖి ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కూడా ఈ బ్యూటీ ఆ హీరోను ఎలా పడేసి ఉంటుందా..? అని ఆశ్చర్యపోతున్నారట. అయితే అతను ఎవరనేది తెలియకపోయినా.. స్టార్ హీరో అయి ఉంటాడు.. శ్రీముఖి అంటే మినిమమ్ ఉంటుందిలే అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.