ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అసలు సిసలు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ఎవరు అని అడిగితే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి. టాలీవుడ్ లో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ కిడ్ గా చలామణి అయ్యింది. ఆ తర్వాత ఈమె 16 ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది. చిన్నప్పుడు ఎవరి సినిమాల్లో అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందో, ఆ హీరో సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది.
హిట్ మీద హిట్ కొట్టి ఎవ్వరూ అందుకొని రేంజ్ కి వెళ్ళింది. చూపులు తిప్పుకోలేని అందం తో అద్భుతమైన నటన తో ఒక స్టార్ హీరో కి ఎలాంటి క్రేజ్ అయితే ఉంటుందో అలాంటి క్రేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగు లో పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యాక ఆమె హిందీ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది.
అక్కడ ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోణి కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బోణి కపూర్ ఇంట్లో వాళ్లకి శ్రీదేవి ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా సర్దుకొని ఎన్నో అవమానాలను ఎదురుకొని కాపురం ని కొనసాగించింది. చిన్న తనం నుండి డబ్బులు సంపాదిస్తూ ఇంటిని పోషించిన శ్రీదేవి, తన తల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో కష్టపడింది. ఇక బోణి కపూర్ ని పెళ్లాడిన తర్వాత అతను సినిమాలు తీసి భారీగా నష్టపోతే, అతని అప్పులు కట్టేందుకు శ్రీదేవి ఎంతో కస్టపడి సంపాదించిన కొన్ని ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్ కి ఇలాంటి దుస్థితి రావడం శోచనీయం. ఆమె చివరి శ్వాస వరకు బోణి కపూర్ వల్ల సమస్యలే కానీ, సుఖపడినట్టు దాఖలాలు ఎక్కడా లేవట. ఇలా శ్రీదేవి గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో బయటపడ్డాయి.