Sri Vidhya : శ్రీదేవీ డ్రామా కంపెనీలో షాకింగ్ ఇన్సిడెంట్.. ప్రియుడి కోసం చేయి కట్ చేసుకున్న కంటెస్టెంట్.. పరిస్థితి సీరియస్

- Advertisement -


Sri Vidhya : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శ్రీదేవీ డ్రామా కంపెనీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కడుపుబ్బా నవ్వించే కామెడీ షోలలో ఒకటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కమెడియన్స్ అందరూ ఈ షోలో కంటెస్టెంట్స్‌గా పార్టిసిపేట్ చేస్తుంటారు. వారితో పాటు అప్పుడప్పుడూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లు, సీరియల్ యాక్టర్లు కూడా పాల్గొంటుంటారు. తాజాగా ఈ షోలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

ఈ షోలో లేడీ కమెడియన్‌గా క్రేజ్ తెచ్చుకున్న శ్రీవిద్య.. తన బాయ్‌ఫ్రెండ్.. మరో మెయిన్ కమెడియన్‌ అయిన వ్యక్తి కోసం తన చేతిని కట్ చేసుకుని తీవ్రంగా గాయపడింది. అలా చేయడంతో శ్రీవిద్య చేతికి దాదాపు ఆరు కుట్లు పడ్డాయి. ఇది చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు విషయం ఏంటంటే.. ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ, లోకల్ ఛానెల్‌లో కామెడీ వీడియోలు చేస్తున్న శ్రీవిద్యకు జబర్దస్త్ లో చేసే అవకాశం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు విపరీతమైన పాపులారిటీ దక్కింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఈ భామ కనిపించింది.

Sri Vidhya

అయితే అద్భుతమైన కామెడీతో ఆకట్టుకున్న శ్రీవిద్య అందరికీ షాక్ ఇచ్చింది. తన ప్రియుడి గురించి వెల్లడించింది. జబర్దస్త్‌తో పాటు డ్రామా కంపెనీలో తనతో కామెడీ స్కిట్ చేయబోయే మరో వ్యక్తి తనకు ఇష్టమని శ్రీదేవి చెప్పింది. ఈమధ్య నాతో ఎక్కువగా మాట్లాడడం లేదు.. పట్టించుకోవడం లేదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.. నేను అందుకే చాలా ఫీల్ అయ్యాను.. అతనికి నా ప్రేమ ఏంటో తెలియాలని.. ఎలా చూపించాలో తెలియక.. ఆ బాధ ఎలా దిగమింగుకోవాలో తెలియక.. నా చేయి కట్ చేసుకున్నానని వివరించింది.

- Advertisement -

తనకు ఆరు కుట్లు పడ్డాయని చెప్పింది. అంతకు ముందు శ్రీవిద్య మాత్రం చేతికి గాయమైందని.. అసలు విషయం ఏంటని కమెడియన్ హైపర్ ఆది ప్రశ్నించారు. దీంతో కమెడియన్ బాబు కోసమే శ్రీవిద్య ఎలా చేస్తుందని అక్కడ ఉన్న వాళ్ళంతా వివరించారు.

దీంతో బాబును కూడా వేదికపైకి పిలిచి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా చూసిన యాంకర్ రష్మీ.. ఇలాంటి పనులకు చేతులు కోసుకోవడం పిచ్చి కాకపోతే.. ఎప్పుడూ ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పింది. బాబూ కూడా నేను ఏదో పనిలో నిమగ్నమై నిన్ను పట్టించుకోలేదు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నాకు నువ్వంటే ఇష్టమే. నీ మీద ప్రేమ లేక కాదు అంటూ వివరించాడు.

మనం జీవితాంతం కలిసి ఉండకపోయినా నువ్వు మాత్రం మ‌రోసారి ఎప్పుడు ఇలాంటి పనులు చేయొద్దంటూ చెప్పుకొచ్చాడు. నువ్వు మాత్రమే కాదు మరెవరు ఇలాంటి పనులు చేయకండంటూ వివరించాడు. అయితే ఇదంతా టిఆర్పి కోసం వేసిన ప్లాన్ అని చూసేవారికి క్లియర్ గా తెలుస్తుంది. ముఖ్యంగా అసలు చేతిని కానీ కుట్లను కానీ సరిగ్గా చూపించకపోవడంతో.. ఇదంతా స్కిట్లో భాగమే అని తెలిసిపోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com