Actress : ఇటీవల కాలంలో హీరోయిన్లు ఒక సినిమాలో నటించాలంటే చిన్న హీరోయిన్లు అయినా రూ.కోటి డిమాండ్ చేస్తున్నారు. అదే స్టార్ హీరోయిన్స్ అయితే కనీసం రూ.5కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అప్పట్లో అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్లు. పైగా సినిమాలో క్యారెక్టర్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉండేది. అందుకే హీరోయిన్లకి పారితోషకం చాలా తక్కువగా ఉండేది. ఇక ఇండస్ట్రీలో అసలు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

అప్పట్లో హీరోయిన్లు చాలా మంది రూ.కోటి రెమ్యురేషన్ తీసుకోవాలని కలలు కనేవారు. ముఖ్యంగా హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో నటించిన వాళ్లు కూడా చాలా కాలం వరకు రూ.కోటి పారితోషకం తీసుకోలేకపోయారు. అంతేకాదు ఈ హీరోలు కూడా రూ.కోటి తీసుకోవడానికి చాలా టైం మే పట్టింది. అందుకే అప్పట్లో హీరోయిన్లలో చాలా మందికి రూ.కోటి రెమ్యునరేషన్ అందుకోవాలన్న కోరిక బలంగా ఉండేది.

ఇండస్ట్రీ చరిత్రలో రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటి ఎవరో కాదు.. ఆమె అతిలోకసుందరి శ్రీదేవి. అప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లు ఉండగా ఆమె రూ.కోటి రెమ్యునరేషన్ రికార్డును సాధించింది. సావిత్రి , జమున, సూర్యకాంతం లాంటి ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ ఈ పారితోషకం అందుకునే స్థాయి కేవలం శ్రీదేవికి మాత్రమే దక్కింది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీలో కూడా నటించి అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ సమయంలో భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసి.. అడిగినంత పారితోషకాన్ని దక్కించుకునేది. అందుకే ఈమెకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా అడిగినంత ఆఫర్ చేసి తమ సినిమాల్లో బుక్ చేసుకునే వారు.

అందుకే శ్రీదేవి కూడా ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ మొహమాటం లేకుండా అడిగేదట. ఇదిలా ఉండగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఒక హిందీ సినిమా కోసం ఏకంగా రూ.కోటి రెమ్యునరేషన్ అడిగింది. స్టార్ హీరోయిన్ కావడంతో దర్శకనిర్మాతలు ఆమెకు అడిగినంత ముట్టజెప్పారు. దీంతో భారతీయ సినిమా చరిత్రలో కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటిగా శ్రీదేవి రికార్డు సృష్టించింది. అప్పట్లో కోట్లాదిమంది హృదయాలను సొంతం చేసుకున్న శ్రీదేవి అంతే త్వరగా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇక ఈమె లేని స్థానాన్ని ఎవరు బర్తీ చేయలేకపోయారు. ప్రస్తుతం ఆమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.