Sreemukhi : శ్రీముఖి అంటే తెలియని వారు లేరు. హీరోయిన్గా అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. పటాస్ షో ద్వారా వచ్చిన యాంకర్ అవకాశాన్ని వినియోగించుకొని ఆమె స్టార్ యాంకర్ గా మారింది. సోలోగా యాంకరింగ్ చేస్తూ, రిలీజ్ ఈవెంట్లు ,ఆడియో లాంచ్ లు చేస్తూ, ఫంక్షన్లకి యాంకర్ గా చేస్తూ సందడి చేస్తోంది . ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించింది.
ప్రస్తుతం తెలుగు యాంకర్లలో సుమ తర్వాత శ్రీముఖి సెకండ్ అనే మాట వినిపిస్తోంది. శ్రీముఖికి 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పటికప్పుడు శ్రీముఖి పెళ్లి అంటూ చాలా వార్తలు వచ్చినప్పటికీ, శ్రీముఖి మాత్రం ఇప్పుడే నా పెళ్లి లేదు, అని చెప్తూ వస్తోంది. అయితే తాజాగా శ్రీముఖి అతనినే పెళ్లి చేసుకోబోతోంది , అంటూ నెట్ లో ఒక న్యూస్ వైర్లెయ్యింది. శ్రీముఖి కేవలం యాంకరింగ్ చేయడం మాత్రమే కాకుండా, బిగ్ బాస్ రన్నరప్ గా కూడా నిలిచిన సంగతి అభిమానులకు తెలిసిందే. చేతినిండా రకరకాల షోలతో ఇండస్ట్రీలోనే బిజీ యాంకర్ గా శ్రీముఖి మారిపోయింది .
ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. వారంలో కనీసం నాలుగైదు తన హాట్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఫొటోగ్రాఫర్ ను పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ‘‘ఏంటి శ్రీముఖి ఎప్పుడు అవే ఫోజులు మార్చవా? బోర్ కొడుతోంది, అంటూ కామెంట్ చేశారు. మరి కొంతమంది నీకు ఈ ఫోటోలు పిచ్చి ఏంటమ్మా తల్లి, నువ్వు చూస్తుంటే చివరికి ఫోటోగ్రాఫర్ నే పెళ్లి చేసుకునేలా ఉన్నావు” కదా అని కామెంట్ చేశారు.