దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ఈమె నటిగానే కాదు.. పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో వివాదాలను ఫేస్ చేస్తోంది ఈ భామ. కెరీర్‌లో మొదట్లోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ.. గతేడాది చివర్లో రవితేజతో చేసిన ‘ధమాకా’ మూవీతో ధమాకా లాంటి విజయాన్ని సొంతం చేసుకొని టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది.

నిజానికి శ్రీలీల 2001 జూన్ 14న యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. బెంగుళూరులో పెరిగింది. అయితే అమెరికాలో పుట్టిన శ్రీలీల బెంగుళూరు వచ్చేయడం వెనక ఒక చేదు గతం దాగి ఉంది. శ్రీలీల తల్లి పేరు స్వర్ణలత. గైనకాలజిస్ట్ అయిన ఆమె పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావును వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఆమెరికాలో స్థిరపడ్డారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది నెలలకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయట. స్వర్ణలత ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనే భర్త శుభాకరరావు నుంచి విడాకులు తీసుకుందని టాక్. ఆపై శ్రీలీలకు జన్మనిచ్చిందిట. ఇక శ్రీలీల పుట్టిన కొద్ది రోజులకు స్వర్ణలత బెంగుళూరు వచ్చేసి ఇక్కడే స్థిరపడింది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు చిన్నతనంలోనే విడాకులు అయినా.. సింగిల్ గానే ఉంటూ శ్రీలీలకు తండ్రి లేని లోటు లేకుండా పెంచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ భామ పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడ చూసిన ఈ అమ్మడి ఫొటోలే దర్శనమిచ్చాయి. శ్రీలీల అతి తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సరసన నటిస్తోంది. అందులో ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. దీనితో పాటు గుంటూరు కారం
, బాలకృష్ణ భగవంత్ కేసరి
, నవీన్ పొలిశెట్టి ’, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు
, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ్
, నితిన్ జూనియర్
చిత్రాలు చేస్తోంది. అలాగే రామ్ పోతినేని-బోయపాటి మూవీతో పాటు విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమాకు శ్రీలీల కమిట్ అయింది.