Sreemukhi : అక్క అక్క అంటూ శ్రీముఖిని దారుణంగా మోసం చేసిన తోటి యాంకర్

- Advertisement -

Sreemukhi : తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉంది. తొలుత సినీ నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ శ్రీముఖి ఆ తర్వాత యాంకర్ గా రాణించింది. ‘పటాస్’ వంటి ప్రోగ్రామ్ తో క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి… ఆ తర్వాత పలు షోలతో టాప్ యాంకర్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు షోలు ఉన్నాయి. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా, జెమిని తదితర ఛానళ్లలో ఆమె షోలు చేస్తోంది.

Sreemukhi
Sreemukhi

పలు షోల్లో చేయడమే కాకుండా మూవీ ఈవెంట్స్‌లో కూడా తన యాంకరింగ్‌తో అందరినీ అలరిస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్‌ హౌసులోకి వెళ్లిన తర్వాత అమ్మడి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. లౌడ్ స్పీకర్‌గా, తన ఎనర్జీకి అందరూ ఆమెకు అట్రాక్ట్ అయ్యారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

sreemukhi
sreemukhi

అక్కా అక్కా అంటూనే ఓ యాంకర్ అమ్మడికి భారీగా బొక్క పెట్టిందట. అసలు మేటరేంటంటే.. విశ్వంభర సినిమాలో శ్రీముఖి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆఫర్‌ను మరో అమ్మాయి ఎగిరేసుకుని పోయిందంట. శ్రీముఖితో పాటు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానం అందుకున్న ఈ బ్యూటీ ఆ ఆఫర్ ని కొట్టిసినట్లు తెలుస్తోంది. అంతేకాదు శ్రీముఖిని అక్క అక్క అంటూ పిలుస్తూనే మెత్తగా బొక్క పెట్టిందంటూ జనాలు శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here