Anchor Sreemukhi : యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఇక ప్రస్తుతం అన్ని ఛానల్స్ లో శ్రీముఖినే కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా అమ్మడి పెళ్లి గురించే ప్రస్తావన నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అయితే తనకు ఇప్పటికే బ్రేకప్ అయ్యిందని ఆమె చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్నది షోస్ లలో ఎంత అల్లరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న షోస్ లలో ఆదివారం మా పరివారం ఒకటి. ఇందులో ప్రతివారం సీరియల్ నటీనటులను పిలిచి.. రెండు జట్టులుగా విడదీసి గేమ్స్ ఆడిస్తారు. ముక్కు అవినాష్, హరి.. తమ పంచ్ లతో నవ్విస్తూ ఉంటారు. ఇక ఈసారి ఈ షో లో గుండె నిండా గుడిగంటలు, వంటలక్క సీరియల్స్ నటీనటులు వచ్చారు. గుండె నిండా గుడిగంటలు హీరో బాలు(విష్ణుకాంత్) వచ్చిన ప్రతిసారి శ్రీముఖి మెలికలు తిరిగిపోతూ ఉంటుంది.
ఇక ఈసారి కూడా బాలుతో శ్రీముఖి రచ్చ రచ్చ చేసింది. బాలును తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇన్నాళ్లు రాలేదు ఏంటి అని అలిగింది. ఇక అతనికి తెలుగు రాకపోవడంతో.. శ్రీముఖికి ఏం చెప్పాలో తెలియని సందిగ్ద పరిస్థితిలో కనిపించాడు. చివరికి బాలు చేత అక్షరాభ్యాసం చేయిస్తూ.. శ్రీముఖి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేయించింది. ఇదంతా సరదాకే అయినా కూడా.. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది పెళ్లి చేసుకోండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.