Sreemukhi: బుల్లితెర స్టా్ర్ యాంకర్ సుమ తర్వాత తెలుగులో అంతటి పేరు తెచ్చుకున్న మరో యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డ్యాన్స్, అందాలతో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒక పక్క షోలు చేస్తూనే.. మరో పక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఇక ప్రస్తుతం ఏ ఛానల్ చూసినా శ్రీముఖినే కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా అమ్మడి పెళ్లి గురించే ప్రస్తావన నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే తనకు ఇప్పటికే బ్రేకప్ అయ్యిందని తను ఇటీవల పాల్గొన్న చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ షోలలో ఎంత అల్లరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న షోలలో ఆదివారం ‘మా పరివార్’ ఒకటి. ఇందులో ప్రతివారం సీరియల్ నటీనటులను పిలిచి.. రెండు జట్టులుగా విభజించి వారితో ఆటలు ఆడిస్తారు. ముక్కు అవినాష్, హరి.. తమ పంచ్ లతో నవ్విస్తూ ఉంటారు. ఇక ఈసారి ఈ షో లో గుండె నిండా గుడిగంటలు, వంటలక్క సీరియల్స్ కు సంబంధించిన నటీనటులు వచ్చారు. గుండె నిండా గుడిగంటలు హీరో బాలు(విష్ణుకాంత్) వచ్చిన ప్రతిసారి శ్రీముఖి మెలికలు తిరిగిపోతూ ఉంది.
ఇక ఈసారి కూడా బాలుతో శ్రీముఖి రచ్చ రచ్చ చేసేసింది. బాలును తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఇన్నాళ్లు రాలేదు ఎందుకని అని అలిగింది. ఇక అతనికి తెలుగు రాకపోవడంతో.. శ్రీముఖికి ఏం చెప్పాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో కనిపించాడు. చివరికి బాలు చేత అక్షరాభ్యాసం చేయిస్తూ.. శ్రీముఖి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేయించుకుంది. ఇదంతా సరదాకే అయినా కూడా.. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది పెళ్లి చేసుకోండి అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.